Andhra Pradesh
ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ ఆత్మహత్య
Kalinga Times ,Hyderabad : ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ (72) ఆత్మహత్య చేసుకున్నారు. సోమవారం మధ్యాహ్నం కోడెల తన ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఆస్పత్రిలో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. కాగా.. గత కొన్ని రోజులుగా ఈయన్ను కేసులు చుట్టుముట్టడంతో.. రాజకీయ వేధింపులు తట్టుకోలేక ఆయన ఆత్మహత్య చేసుకున్నారు. ఇదిలా ఉంటే.. కోడెలను గుంటూరులో ఆయన అభిమానులు, అనుచరులు ‘పల్నాటి పులి’గా పిలుచుకుంటూ ఉంటారు. కోడెల ఇకలేరన్న విషయం తెలుసుకున్న వీరాభిమానులు, టీడీపీ కార్యకర్తలు విషాదంలోమునిగిపోయారు.