social

వెళ్ళి రావయ్యా..మహా గణపయ్యా..

Kalinga Times,Hyderabad :పది రోజులు భక్త జనుల పూజలందుకున్న గణనాథులు నిమజ్జనానికి తరలుతున్నారు. హైదరాబాద్ నగరంలో వినాయక నిమజ్జన శోభాయాత్ర శోభాయమానంగా సాగుతోంది. నిమజ్జన కార్యక్రమాన్ని వేగవంతంగా పూర్తి చేసేందుకు పోలీసులు పక్కా ప్రణాళిక రూపొందించడంతో శోభాయాత్ర నిర్విఘ్నంగా సాగుతున్నది. భాగ్యనగర రహదారులపై వేల సంఖ్యలో గణనాథులు వరుసలో తరలి వస్తున్న దృశ్యం కన్నుల పండువగా ఉంది. పెద్ద సంఖ్యలో భక్తులు శోభాయాత్రలో పాల్గొంటున్నారు. ఇప్పటికే అధిక సంఖ్యలో భక్తులు ట్యాంక్ బండ్ వద్దకు చేరుకున్నారు.

ఘనంగా పూజలందుకున్న గణపయ్య.. గంగ ఒడికి చేరేందుకు సిద్ధమయ్యాడు. చివరి పూజలందుకున్న ఖైరతాబాద్ శ్రీద్వాదశాదిత్య మహాగణపతిని భారీ క్రేన్‌ సాయంతో ట్రక్కుపైకి విగ్రహాన్ని నిర్వాహకులు ఎక్కించారు. భారీ గణపతి శోభాయాత్ర ప్రారంభం కావడంతో ఇప్పటికే భక్తులు చేరుకున్నారు. హైదరాబాద్‌లో మొదట నిమజ్జనం జరిగేది కూడా ఖైరతాబాద్ మహా గణపతేనని నిర్వాహకులు తెలిపారు. ఉదయం 11 గంటలకు ఎన్టీఆర్ మార్గ్‌లోని క్రేన్ నెంబర్ 6 దగ్గరకు ఖైరతాబాద్ మహా గణపతి చేరుకుంటారని వారు తెలిపారు. ఖైరతాబాద్ శ్రీద్వాదశాదిత్య మహాగణపతిని ఒంటి గంటలోపే నిమజ్జనం చేసేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. మహా గణపతిని సంపూర్ణంగా నిమజ్జనం చేసేందుకు క్రేన్ నెంబర్ 6 దగ్గర 20 ఫీట్లకు పైగా లోతు పెంచినట్లు జీహెచ్‌ఎంసీ తెలిపింది.

Tags
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close