social
ప్రతి మూడు నిమిషాలకు ఒకరు సూసైడ్ అటెంప్ట్
Kalinga Times, Hyderabad : క్షణికావేశంలో కొందరు, పనిలో ఒత్తిడి కారణంగా ఒకరు, కోరుకున్నవారు దక్కలేదని మరొకరు, చదువుల్లో రాణించలేకపోయామని కొందరు, కుటుంబ భారం మోయలేక ఇంకొందరు ఇలా ఆత్మహత్య చేసుకుంటున్నారు.
2003 నుంచి ప్రతి యేడాది సెప్టెంబరు పదో తేదీన అంతర్జాతీయ ఆత్మహత్యల నివారణ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ సహకారంతో దీన్ని నిర్వహిస్తున్నారు. అయితే, ప్రపంచ వ్యాప్తంగా ప్రతి యేటా 10 లక్షల మందికి పైగా ఆత్మహత్యలు చేసుకుంటున్నట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. వీరిలో 15 యేళ్ల నుంచి 30 యేళ్ళ లోపు వారే అధికంగా ఉన్నారు. ప్రతి 40 సెకన్లకు ఒకరు ఆత్మహత్యాయత్నం చేస్తుంటే, ప్రతి మూడు నిమిషాలకు ఒకరు చనిపోతున్నారు. పైగా, పురుషుల కంటే మహిళలు అధికంగా సూసైడ్ అటెంప్ట్ చేస్తున్నారు. కానీ చనిపోయే వారి సంఖ్య మాత్రం మహిళల కంటే పురుషులకే అధికంగా ఉంది. ఫలితంగా సగటున ప్రతి రోజూ దాదాపు మూడు వేల మంది చనిపోతున్నారు. ఈ ఆత్మహత్యలకు పాల్పడేవారు క్షణికావేశంలో కొందరు, పనిలో ఒత్తిడి కారణంగా ఒకరు, కోరుకున్నవారు దక్కలేదని మరొకరు, చదువుల్లో రాణించలేకపోయామని కొందరు, కుటుంబ భారం మోయలేక ఇంకొందరు ఇలా ఆత్మహత్య చేసుకుంటున్నారు. అయితే, ఆత్మహత్య అనే భావన క్షణికావేశంలో రాదనీ, మనసులో ఎప్పటి నుంచే సుడులు తిరిగినట్టుగా తిరుగుతూ ఉండటం వల్లే ఈ పరిస్థితి వస్తుందని నిపుణులు అంటున్నారు.
సూసైడ్ స్పాట్
దక్షిణాది ఇంగ్లాండ్ లోని ఈస్ట్ బోర్న్ సిటీ ప్రాంతంలో వుండే ఈ కోస్టల్ ఏరియాలో ఉంది. 17వ శతాబ్దం నుంచి ఈ బీచ్ సూసైడ్ లకు ప్రసిద్ధిగాంచింది. అందమైన సూసైడ్ స్పాట్ గా పేరొందింది.2004 నుంచి ఈ బీచ్ లో 5,500మందికి పైగా ఆత్మహత్యలు చేసుకోవడం గమనార్హం.సాధారణంగా బీచ్ దగ్గర మనం నడుస్తూ ఉంటే నీరు మన పాదాలకు తగులుతూ ఉంటుంది కదా. కానీ ఇక్కడ మాత్రం సముద్రాన్ని బీచ్.. 531 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఇదో కొండలాగా. దాని కింద సముద్రంలాగా ఉంటుంది. ఆ కొండపై నుంచి కిందకు దూకే అందరూ ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. గత రెండు నెలల్లోనూ దాదాపు 10మందికిపైగే అక్కడ ఆత్మహత్యలు చేసుకోవడం గమనార్హం. సంవత్సరానికి కనీసం 20మంది ఇక్కడ ప్రాణాలు వదలుతున్నారు. వీటిని అడ్డుకోవడానికి కొన్ని ప్రత్యేక బృందాలను అక్కడ ఏర్పాటు చేశారు. అయినప్పటికీ ఈ సూసైడ్స్ మాత్రం ఆగడంలేదని అక్కడి అధికారులు చెబుతున్నారు.