Telangana

తెలంగాణ బడ్జెట్ ముఖ్యాంశాలు

Kalinga Times, Hyderabad : 2019-20 సంవత్సరానికి గాను తెలంగాణ రాష్ట్ర పూర్తి స్థాయి బడ్జెట్ ను ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీకి ప్రవేశపెట్టారు. రాష్ట్రం పారిశ్రామికంగా అభివృద్ధి చెందిందని, మాంద్యం ప్రభావం రాష్ట్రంపై నామమాత్రమేనని అన్నారు. ఈ సంవత్సరం వర్షాలు పుష్కలంగా పడటంతో, జాతీయ సగటుతో పోలిస్తే అధిక జీడీపీ సాధ్యమేనని అన్నారు.

  • 2019-20 సంవత్సరానికి బడ్జెట్ అంచనా రూ. 1,46,492 కోట్లు.
  • ఫిబ్రవరిలో సమర్పించిన అంచనా రూ. 1.82 లక్షల కోట్లతో పోలిస్తే తగ్గిన అంచనాలు.
  • దేశంలోనే తెలంగాణ అగ్రగామి రాష్ట్రం.
  • గత ఐదేళ్లలో ఎన్నో వినూత్న పథకాలు.
  • 2014లో రాష్ట్రం ఏర్పడినప్పుడు నెలకు ఖర్చు రూ. 6,247 కోట్లు.
  • ఈ సంవత్సరం నెలకు రూ. 11,305 కోట్లు ఖర్చవుతోంది.
  • గడచిన ఐదేళ్ల వ్యవధిలో ఆదాయ వృద్ధి సాలీనా 21.49 శాతం.
  • 2018-19 ఆర్థిక సంవత్సరం వృద్ధి 5.8 శాతం.
  • రాష్ట్ర జీడీపీ వృద్ధి రేటు 4.5 శాతం నుంచి 10.20 శాతానికి పెరిగింది.
  • రెవెన్యూ వ్యయం రూ. 1,11,055 కోట్లు.
  • మూలధన వ్యయం రూ. 17,274.67 కోట్లు.
  • బడ్జెట్ అంచనాలో మిగులు రూ. 2,044.08 కోట్లు.
  • ఆర్థిక లోటు రూ. 24,081.74 కోట్లు.
  • 29 శాతం తగ్గిన పన్నేతర ఆదాయం.
  • రాష్ట్రానికి ఇవ్వాల్సిన నిధుల్లో కోత పెడుతున్న కేంద్రం.
  • అన్ని రంగాలకూ నాణ్యమైన విద్యుత్ ను రోజంతా అందిస్తున్నాం.
  • రైతు బంధు, రైతు బీమాలతో రైతాంగానికి ఎంతో మేలు.
  • సుస్థిరమైన అభివృద్ధిని సాధ్యం చేసి చూపించాం.
  • రాష్ట్రంలో అవినీతి రహిత పాలన అందించడమే లక్ష్యం.
  • వ్యవసాయ రంగంలో 8.1 శాతం వృద్ధిని సాధించాం.
  • ఐటీ ఎగుమతుల విలువ 100 శాతానికి పైగా పెరిగింది.
  • గురుకులాల పేరుతో అత్యున్నత ప్రమాణాలతో విద్య.
  • రాష్ట్రంలోని గురుకుల పాఠశాలల్లో లక్ష మందికి పైగా చదువుతున్నారు.
  • మిషన్ కాకతీయ ద్వారా వేలాది చెరువుల్లో నీరు చేరింది.
  • ప్రతి ఒక్కరికీ మంచి నీటి కొరత లేకుండా చేసి చూపుతాం.
  • కనిపిస్తున్న గణాంకాలన్నీ మాంద్యం ఉందని చూపుతున్నాయి.
  • వాహనాల ఉత్పత్తి 33 శాతం తగ్గడం కూడా ఇందుకు నిదర్శనం.
  • వాహనాల కొనుగోలు 10 శాతానికి పైగా తగ్గింది.
  • కొనేవారు లేక దిక్కులేకుండా పడివున్న వేలాది వాహనాలు.
  • వాహన అమ్మకాలు సాగితే, మరింత ఆదాయం లభించివుండేది.
  • విమానయాన రంగంతో పాటు గూడ్స్ రైళ్ల బుకింగ్ పైనా మాంద్యం ప్రభావం.
  • రూపాయి మారకపు విలువ దారుణంగా పడిపోవడం భయాన్ని కలిగిస్తోంది.
  • ఇతర రాష్ట్రాలతో పోలిస్తే గుడ్డిలో మెల్లలా రాష్ట్ర పరిస్థితి.
  • విపత్కర పరిస్థితుల్లో బడ్జెట్ ప్రవేశపెట్టాల్సి వచ్చింది.
  • గత బడ్జెట్ కు, ఇప్పటి బడ్జెట్ కు ఎంతో తేడా ఉంది.
  • కేంద్ర, రాష్ట్రాల ఆదాయ వృద్ధి గణనీయంగా పడిపోయింది.
  • ప్రజోపయోగ కార్యక్రమాలకు రూ. 1,03,551 కోట్లు.
  • రాష్ట్ర పారిశ్రామిక రంగంలో 5.8 శాతం వృద్ధి లక్ష్యంగా ముందడుగు.
  • ఎట్టి పరిస్థితుల్లో కాళేశ్వరం, పాలమూరు – రంగారెడ్డి, సీతారామ ప్రాజెక్టులు కొనసాగుతాయి.
  • రైతు బంధు పథకాన్ని ఆపాలన్న ఆలోచనే లేదు.

Tags
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close