social

సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలంటే …

Kalinga Times, Hyderabad :మనం రోజూ తీసుకునే ఆహారంలో కాయ గూరలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తేనే అనారోగ్యానికి దూరంగా ఉండగలం.సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలంటే మనం తీసుకునే ఆహారంలో ఎక్కువగా శారీరక శక్తిని ఇచ్చే కూరగాయలు ఏమిటో ఒకసారి పరిశీలిద్దాం.

ముల్లంగి
చలికాలంలో ముల్లంగి తినడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలను అధిగమించవచ్చు. సీజన్‌లో దీన్ని ఎండబెట్టి ఉంచుకుంటే కావలసినప్పుడు ఉడకబెట్టుకోవచ్చు. ముల్లంగి మధుమేహాన్ని తగ్గిస్తుంది.
వంకాయ
వంకాయ కూరలను వెల్లుల్లి, ఇంగువ వేసి వండుకొని తింటే జీర్ణకోశంలోని వాయువ్ఞ తొలగి కడుపు ఉబ్బరం తగ్గుతుంది. గ్యాస్‌, వాయు, వికారాలకు ఇది అద్భుతమైన ఆహారం. వంకాయలను కాల్చిగాని, ఉడికించిగాని పచ్చడి చేసుకుని తిన్నా మంచి ఫలితముంటుంది.
బెండకాయ
బెండకాయలోని మ్యూకస్‌ వంటి పదార్థము కడుపులో మంట నుంచి ఉపశమనాన్ని ఇస్తుంది. పీచు, విటమిన్‌ ‘సి దీనిలో చాలా ఎక్కువ. మ్యూకస్‌ పదార్థం గ్యాస్ట్రిక్‌ సమస్యలను, ఎసిడిటీకి చక్కని పరిష్కారం. దీనిలోగల డయూరిటిక్‌ లక్షణాల వల్ల యూనరీ ట్రాక్షన్‌ ఇంఫెక్షన్‌ను నయం చేయడంలో సహకరిస్తుంది. బెండకాయ డికాషన్‌ తాగితే జ్వరం తగ్గుతుంది. చిన్నచిన్న ముక్కలుగా కోసి నీటిలో మరిగించి చల్లారాక తాగితే టెంపరేచర్‌ తగ్గుతుంది. చక్కెర నియంత్రణలోనూ సుగుణం చూపుతుంది. బెండకాయ నిలువ్ఞగా చీల్చి రెండు సగాల్ని గ్లాసు నీటిలో రాత్రంతా ఉంచి, మరునాటి ఉదయము ముక్కలు తీసివేసి ఆ నీటిని తాగాలి. ఇలా రెండు వారాల పాటు తాగితే షుగర్‌ స్థాయిలు తగ్గుతాయి. దీనిలో ఉండే పెక్టిన్‌ బ్లడ్‌ కొలెస్టరాల్‌ను తగ్గిస్తుంది.
టమాటాలు
టమాటాలు షుగర్‌ వ్యాధిని అదుపుచేస్తాయి. సూప్‌ చేసుకొని తాగితే మంచిది. టమాటాల రసం, కాకరకాయ రసం కలిపి తాగితే అనేక రోగాలు నయమవ్ఞతాయి. డయాబెటిస్‌ని శాశ్వతంగా దూరం చేస్తుంది ఈ రసం. పచ్చిటమాటాలు ఆకలిని పెంచి అరుగుదలకు తోడ్పడతాయి. నీరసాన్ని, బలహీనతను తగ్గిస్తాయి.ఈ రసాన్ని ఉదయం, సాయంత్రం తగినంత ఉప్పుగాని, చక్కెరగాని వేసుకొని తాగితే చర్మం ఎండిపోయినట్లుండడం తగ్గి నిగారింపు వస్తుంది.
బొప్పాయి
బొప్పాయిలోని విటమిన్‌-ఎ ఉండడం వల్ల దృష్టిలోపాలను రాకుండా చూస్తుంది. జీర్ణశక్తిని పెంచుతుంది.చంటిపిల్లల తల్లులు దీన్ని కూరగా చేసుకుని తింటే పిల్లలకు పాలు సమృద్ధిగా ఉంటాయి. ప్రేగులను శుభ్రపరుస్తుంది. లివర్‌ దోషాలను సవరిస్తుంది.
కాకరకాయ
కాకరకాయ షుగర్‌వ్యాధిని పోగోడుతుంది. కడుపులో నులిపురుగులంటే చచ్చిపోతాయి.ఈ కూరను తరుచూ తింటుంటే, గ్యాస్‌, కడుపుఉబ్బరం, అజీర్ణం తగ్గుతాయి. ఆకలిని పెంచుతుంది. దీన్ని ఉడికించినా వేపుడుగా చేసినా, పోషకాలను కోల్పోము. వేసవికాలంలో తింటే ఎండవల్ల వచ్చే పుళ్లు, సెగగడ్డలు రాకుండా ఉంటాయి.
అరటిదూట
అరటిదూట కడుపునొప్పిని పోగొడుతుంది. నులిపురుగులును పోగొడుతుంది. అరటిదవ్వని చిన్నచిన్నముక్కలుగా తరిగి ఎండబెట్టుకొని పౌడర్‌గా చేసుకోవాలి. ఆ పొడిని చక్కెరతోగాని, తేనెతో గాని తీసుకుంటుంటే గర్భాశయ వ్యాధులుంటే తగ్గిపోతాయి. అరటిదూట కిడ్నీలోని రాళ్లను కరిగించడంలో ముఖ్యపాత్ర వహిస్తుంది.దూటలను పొడిగా చేసి తింటుంటే రక్తవిరేచనాలు తగ్గిపోతాయి. లంగ్స్‌కి రక్షణగా పనిచేసి ఊపిరితిత్తుల వ్యాధిని నివారిస్తుంది. అరటి పిందెలను ఎండబెట్టి, పొడిచేసి తింటుంటే అమీబియాసిస్‌ తగ్గుతుంది.ముదిరిన అరటికాయను ఎండబెట్టి, పొడిచేసి తింటుంటే ఒకవేళ హెర్నియా ఉంటే తగ్గిపోతుంది. అరటి పువ్ఞ్వ కూర వడియాలు, ఊపిరితిత్తులకు మంచివి. అన్నం హితవ్ఞ కలిగిస్తుంది. పొట్టభారాన్ని తగ్గిస్తుంది.
కాలీఫ్లవర్‌
కేబేజీ, కాలీఫ్లవర్‌లు కేన్సర్‌ వ్యాధిని నివారిస్తాయి. కేబేజీని రసం చేసుకొని తాగుతుంటే కడుపులోని అల్సర్‌లు మానిపోతాయి.శరీర బరువును అదుపులో ఉంచుతుంది. 75గ్రా. కేబేజీని ముక్కలుగా చేసిగాని, రసంగాగాని తీసుకుంటుంటే వ్యాధినిరోధకశక్తి పెరుగుతుంది. కేబేజీని నూరి రాస్తే గజ్జి కురుపులు తామర నయమౌతాయి. కీళ్లవాపులు, పంటివ్యాధులు తగ్గిపోతాయి. శరీరంలోని అన్ని భాగాలను శుభ్రం చెయ్యడంలో దీన్ని మించినది లేదు.

ఇవికాక,గుమ్మడి, దోస, సొరకాయల్లో పోషకవిలువలు ఎక్కువగా ఉండడమే కాక, శరీరానికి తగినంత నీరు కూడా లభ్యమవుతుంది.కేరట్‌, కీరదోస, దొండకాయలు, పచ్చివాటిని తినవచ్చు. ఆరోగ్యాన్నివ్వడమే కాక, వికారాన్ని అరుచినిపోగొడతాయి.

Tags
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close