social

ఉగ్రరూపం దాల్చిన గంగ

భయం గుప్పిట్లో ప్రజలు

Kalinga Times, Wranashi : (గవ్వల శ్రీనివాసులు కాశి నుంచి) ఉత్తర భారతదేశంలో కురుస్తున్నవర్షాలు, దానికి తోడు అల్పపీడన ద్రోణి ప్రభావంతో ఉత్తర ప్రదేశ్ లో భారీ వర్షాలు కురుస్తున్నాయి,దీంతో గంగా నది ఉగ్రరూపం దాల్చింది. అలాగే ఉత్తర భారత దేశం నుంచి ప్రవహించే యమున. సరస్వతి నదులు కూడ పొంగి పొర్లుతు అలహాబాద్ లోని త్రివేణిలో కలువడంతో ఊహించని విధంగా అంచనాలకు మించి నీరు ప్రవహిస్తుంది. ఇది ఇలా ఉండగా ప్రపంచంలో అతిపెద్ద పుణ్య క్షేత్రంమొన కాశీ లో పరిస్థితిలు ధారుణంగా పరిణమించాయి. దేశం నలుమూలల నుంచి వచ్చే లక్షలాది భక్తులు ఇబ్బందులకు గురవుతున్నారరు. కాశీలో ఉన్న 80ఘాట్లకు పైగా ఈ గంగానది ప్రవాహం కొనసాగుతుంది. ప్రమాద స్థాయికి ఆమడ దూరంలో ప్రవాహం కొనసాగుతుంది. సుమారు 20మీటర్ల వరకు ఘాట్లవద్దనుంచి కొనసాగుతుంది. దీంతో ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారని తెలిసింది. ఇదిఇలా ఉంటే ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వ యంత్రాంగం ఏలాంటి విపత్తులు చోటుచేసుకోకుండా అనేక చర్యలు తీసుకుంది. కాశీకి వచ్చిన యాత్రికులను అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. నదిలో తిరిగే పడవలను, బోట్లు నిలిపివేశారు. భక్తులను స్థానాలకు కేవలం నది ఒడ్డున ప్రవాహంలేని చోటనే అనుమతించడం జరిగింది. ప్రతి ఘాటు వద్ద సిబ్బందిని నియమించి తగు జాగ్రత్తలు తీసుకున్నది.అయితే ఇక్కడికి విచ్చేసిన భక్తులు గంగాస్నానము ఆదరించి, నదికి హారతులు ఇచ్చి,గంగా ప్రవాహానికి పునితులైనారు. గత పది సంవత్సరాల క్రితం ఈ దృశ్యాన్ని చేశామని తమతమ సంతోషాలను వ్యక్తం చేశారు.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close