Kalinga Times, Hyderabad :సౌత్ సెంట్రల్ కోల్డ్ ఫీల్డ్‌లో 88,585 ఉద్యోగాలు అంటూ విడుదలైన ఉద్యోగ ప్రకటనపై కోల్ ఇండియా స్పందించింది. అది ఫేక్ నోటిఫికేషన్ అని అసలు సౌత్ సెంట్రల్ కోల్డ్ ఫీల్డ్ పేరుతో కోల్డ్ ఇండియాకు సంబంధించి ఎలాంటి సబ్సిడరీ సంస్థ లేదని స్పష్టం చేసింది. ఈ మేరకు కోల్ ఇండియా అధికారికంగా ప్రకటించింది. అధికారిక ఖాతాలో ట్వీట్ కూడా చేసింది. ఈ ప్రకటన నమ్మవద్దని సూచించింది. ఎగ్జిక్యూటివ్ పోస్టులతో పాటు అన్నిరకాల ఉద్యోగాలకు కోల్ ఇండియానే నియామకాలు చేపడతుందని.. ఉద్యోగ ప్రకటనలు కూడా కోల్ ఇండియా వెబ్సైట్ www.coalindia.in లోనే పొందపరుస్తామని కోల్ ఇండియా తెలిపింది. కోల్ ఇండియా అనుబంధ సంస్థలుగా భారత్ కుకింగ్ కోల్ ఇండియా, సెంట్రల్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్, సెంట్రల్ మైన్ ప్లానింగ్ & డిజైన్ ఇన్స్టిట్యూట్ లిమిటెడ్, ఈస్ట్రర్న్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్, మహనంది కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్, నార్తర్న్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్, సౌత్ ఈస్టర్న్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్, వెస్టర్న్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ మాత్రమే ఉన్నాయని ‘సౌత్ సెంట్రల్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్’ పేరుతో ఉన్న ( http://scclcil.in/) వెబ్సైట్ నకిలీదని కోల్ ఇండియా స్పష్టం చేసింది.
— Coal India Limited (@CoalIndiaHQ) August 17, 2019