
Kalinga Times, Hyderabad : ప్రస్తుత పరిస్థితులలో జర్నలిస్టులకు జరుగుతున్న అన్యాయాలను అరికట్టడానికి సంఘటితమై ఉద్యమాలతో సమస్యలను పరిష్కరించుకోవాలని టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు ఆలి నవాబ్ సూచించారు, జర్నలిస్టు సంఘాల లో కొన్ని సంఘాలు అధికారం ఉన్న వాళ్ళకే వత్తాసు పలుకుతున్నారని, అలాంటివాటిని బియ్యంలో నూక గింజలు తొలగించినట్లు తీసివేయాలని దుయ్యబట్టారు, తెలంగాణ 33 జిల్లాల లో టి డబ్ల్యూ జె రాష్ట్ర జిల్లా నియోజకవర్గ మండల స్థాయి కమిటీలు త్వరలోనే పూర్తి చేయాలని ఆయన కోరారు, సంఘాలను పూర్తి చేసినప్పుడే సభలను ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం ఉంటుందన్నారు, తెలంగాణలో కొన్ని సంఘాలు రాజకీయానికి వత్తాసు పలుకుతూ పొట్ట నింపుకుంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు, సమాజం కోసం పాటు పడే జర్నలిస్టు సంఘాలు శాశ్వతంగా నిలిచిపోతాయి అని ఆయన స్పష్టం చేశారు, టి డబ్ల్యూ జె ఏ సంఘానికి కి తెలంగాణ నుండి మంచి స్పందన లభిస్తోందని దీనిని వినియోగించుకోవడానికి జర్నలిస్టులు, ఎడిటర్, సంఘటితం కావాలని పిలుపునిచ్చారు, జర్నలిస్టులకు డబల్ బెడ్ రూమ్, ఉచిత విద్య, ఉద్యోగ భద్రత కల్పిస్తామని మాయమాటలు చెప్పే కొన్ని సంఘాలు జర్నలిస్టులను బజారుపాలు చేస్తున్నారని ఆరోపించారు, తరతరాల నుండి జర్నలిస్టులను రాజకీయ నాయకులు గల్లీ నుండి ఢిల్లీ దాకా కేవలం తమ వార్తలకు కోసమే వాడుకొని వదలి వేస్తున్నారని, కానీ జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించడంలో పూర్తిగా విఫలమయ్యారని ఆయన వ్యాఖ్యానించారు, ముఖ్యంగా టి డబ్ల్యూ జే ఏ రాష్ట్ర నాయకత్వం బలంగా ఉండాలని ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎదుర్కొని జర్నలిస్ట్ లకు అండగా నిలవాలని ఆయన పిలుపునిచ్చారు,