Telangana
మహిళలు స్వయంశక్తితో ఎదగాలి-జంపన ప్రతాప్
Gavvala Srinivasulu,Kalinga Times,Hyderabad : సమాజంలోని బడుగు,బలహీన వర్గాల మహిళలు స్వయం శక్తితో ఎదగాలని,ఆర్థికంగా బలపడాలని,అపుడే తగిన గర్తింపు లబిస్తుందని కంటోన్మెంట్ బోర్డు మాజీ వైస్ చైర్మెన్ జంపన ప్రతాప్ అన్నారు.
ప్రతాప్ తన 60వ జన్మదినోత్సవాన్ని పురష్కరించుకొని ఈ రోజు బోయిన్ పల్లి లోని న్యూసిటి కాలనీలో గల తన నివాస ప్రాంగణంలో రజకులు,దర్జీలకు,టైలరింగ్ పై జీవనాధారం వెలుబచుతున్న మహిళలలకు సోంత నిధులతో ఉచితంగా కుట్టుమిషిన్లు,ఇస్తిరీ పెట్టెలు పంచిపెట్టారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ప్రవేష పెట్టడం జరిగిందని,ప్రజలు ఆ ఫలాలను వినియోగించుకొని స్వయంకృషి తో రాణించాలని ప్రతాప్ కోరారు. అలాగే సమసమాజాభివృద్ధికి కూడ కృషి చేసినవారవుతారని ఆయన ఉద్భోదించారు. మేర సంఘం నాయకులు నాగరాజు,నర్సింగరావు,రాములు,కృష్ణసీనియర్ నాయకులు బాణాల శ్రీనివాసులు తదితరులు లబ్ధిదారులు ఈ కార్యక్రమంలో పాల్గన్నారు.ప్రతాప్ ను అభినందించారు.