Telangana
లంచం తీసుకొంటుండగా రెడ్ హ్యాండేడ్ గా పట్టుకున్న ఎల్ బి నగర్ టాక్స్ ఇన్స్పెక్టర్

Kalinga Times,Hyderabad : మారుతి నగర్ , చాణక్య నగర్ లో నివాసముంటున్న పటేల్ రావు కు సంబంధించిన ఇంటి పన్ను విషయంలో తగ్గించే క్రమంలో 3.50 లక్షల రూపాయలు డిమాండ్ చేయగా , 1 లక్ష యాభై వేల రూపాయలకు ఒప్పందం చేసుకొగా , సదరు ఇంటియాజమని ఏసీబీ అధికారులను ఆశ్రయించగా , ఏసీబీ అధికారుల సూచన మేరకు దానిలో భాగంగా ఈరోజు మారుతీ నగర్ GHMC వార్డు కార్యాలయంలో ఇంటియాజమని నుండి 80.వేల రూపాయలు లంచం తీసుకుంటుండగా వల పన్ని సదరు అధికారులను పట్టుకుని , వారి వద్ద నుండి 80.వేల రూపాయలు స్వాధీనం చేసుకుని వారిపై కేసు నమోదు చేసి , అదుపులోకి తీసుకున్నామని ఏసీబీ అధికారులు తెలిపారు.