Telangana
సైబరాబాద్ కమిషనరేట్ లో ఘనంగా స్వతంత్ర దినోత్సవ వేడుకలు

Kalinga Times,Hyderabad : సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ లో 73వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. సైబరాబాద్ అడ్మిన్ డీసీపీ అనసూయ జాతియా పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డీసీపీ అనసూయ మాట్లాడుతూ.. సిబ్బంది, ప్రజలందరికీ స్వాతంత్ర్య దిన శుభాకాంక్షలు తెలిపారు. స్వతంత్ర పోరాటాన్ని గుర్తు చేసుకోవడం, సర్వస్వం అర్పించి మనకు స్వేచ్ఛను కల్పించిన త్యాగధనులకు మనస్ఫూర్తిగా అంజలి ఘటిస్తూ దేశానికి అంకితం కావడంలోనే ప్రతి మనిషికి సార్థకత లభిస్తుందన్నారు. పోలీసు అధికారులుగా మనమంతా జాతి సమగ్రతకై, శాంతి సమాజ స్థాపనకై తద్వారా ప్రజల అభివృద్ధికి బాటలు వేసేందుకు దృఢనిశ్చయంతో పని చేయాలని స్ఫూర్తినిచ్చారు. ఈ కార్యక్రమంలో సైబరాబాద్ ఎస్బీ ఏడీసీపీ గౌస్ మోహియుద్దీన్, ఏడీసీపీ ఇందిరా, ఎస్బీ ఏసీపీ రవీందర్ రెడ్డి, ఏసీపీ సంతోష్ కుమార్, పోలీసులు తదితరులు పాల్గొన్నారు.