Telangana
మంచిర్యాలలో గోదారి స్నానానికి అడ్డంకిగా గుర్రపు డెక్క
Kalinga Times, Mancheirial : మునిసిపల్ అధికారుల ముందు చూపులేకపోవడం వల్ల మంచిర్యాల గోదావరిలో పుణ్య స్నానాలకు ఆటంకం కలుగుతోంది.గత వారం నుండి సరైన ప్రణాళిక లేకుండా మున్సిపల్ సిబ్బంది గోదావరిలో గడ్డి,చెత్త తొలగింపు కార్యక్రమం చేపట్టారు. అయితే ఏ రోజుకు,ఆరోజు సరికొత్త సమస్య ఎదురవుతోంది. వాస్తవానికి ముందుగా మెట్ల వద్ద కుడి ఎడమ వైపు గల తుమ్మ చెట్లను 100 మీటర్ల మేర తొలగిస్తే ఎలాంటి సమస్య ఉండేది కాదు. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు స్పందించి స్నాన ఘట్టాల పరిసరాలలో గుర్రపు డెక్క తొలగించాలని భక్తులు ,స్తానికులు కోరుతున్నారు.