Telangana
లంచం తీసుకుంటూ రెండ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డ హెడ్‌మాస్టర్
Kalinga Times,Peddapalli : పెద్దపల్లి జిల్లా మంథని డివిజన్ రామగిరి మండలంలోని బేగంపేట్ హైస్కూల్ ప్రధానోపాధ్యాయురాలు దుండిగ లలిత రెండు వేల రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయారు. వివరాలలోకి వెళితే గత విద్యాసంవత్సరంలో సుద్దాల రఘు పదో తరగతి పూర్తి చేశాడు. ఇంటర్‌లో చేరడానికి టీసీ ఇవ్వాలని విద్యార్థి తండ్రి హెడ్‌మాస్టర్ లలితను కలిశారు. అయితే ట్రాన్స్‌ఫర్ సర్టిఫికెట్ (టీసీ) ఇవ్వడానికి వీలుకాదని చెప్పారు. అదేంటని అడిగితే .. మీ బాబుకు టీసీ ఇవ్వాలంటే కొంత ఖర్చు అవుతుందని తెలిపారు. అందుకోసం రఘు తండ్రి నుంచి రెండు వేల రూపాయలు లంచం డిమాండ్ చేశారు. ప్రభుత్వ స్కూల్లో లంచం అడగమేంటని షాక్‌కు గురైన అతను చివరకు చేసేదేమీ లేక ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. రంగంలోకి దిగిన ఆఫీసర్లు రఘు తండ్రి నుంచి రెండు వేల రూపాయలు లంచం తీసుకుంటుండగా రెండ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.