Telangana
విదేశాల్లో చదివేందుకు 20 లక్షల ఆర్థిక సహాయం
Kalinga Times,Hyderabad : విదేశాల్లో చదవాలనుకునే బీసీ విద్యార్థులు మహాత్మ జ్యొతిబాపూలె బిసి ఓవర్సీస్ విద్యానిధి పథకాన్ని వినియోగించుకొనే అవకాశాన్ని ప్రభుత్వం కల్పిస్తోంది. ఈ స్కీం ఆగస్టు 1 నుంచి 31 వరకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఎంపికైన బీసీ విద్యార్థులు విదేశాల్లో చదివేందుకు ప్రభుత్వం రూ.20 లక్షల ఆర్థిక సహాయాన్ని అందిస్తోంది. విద్యార్థులు వీసా, పాస్‌పోర్ట్ కాపీతోపాటు, ఆధార్‌కార్డు, స్థానికత, కుల, ఆదాయ, ఇతర అవసరమైన అన్ని సర్టిఫికేట్లను అప్‌లోడ్ చేసి ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. యూకే, యూఎస్‌ఏ, ఆస్ట్రేలియా, కెనడా, సింగపూర్, జర్మనీ, న్యూజిలాండ్, జపాన్, ఫ్రాన్స్, సౌత్‌కొరియా దేశాల్లో ఉన్నత విద్యావకాశం పొందినవారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. website link.. https://telanganaepass.cgg.gov.in/OverseasLinks.do