social
ఒమిని ఆసుపత్రిలో వైద్యం వికటించి సాఫ్ట్ వెర్ ఇంజినీర్ మృతి
Kalinga Times,Hyderabad : కూకట్ పల్లిలో వైద్యం వికటించి సాఫ్ట్వేర్ ఇంజినీర్ రాజ్ కుమార్ మృతి చెందిన సంఘటన ఒమిని ఆసుపత్రిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే జగత్ గిరిగుట్ట,అంజయ్య నగర్ ప్రాంతంలో నివసించే రమేష్ కుమార్, శారదా దంపతుల కుమారుడు రాజ్ కుమార్ సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. అనారోగ్యరీత్యా గత నెల 25వ తేదీన కూకట్ పల్లి ఒమిని ఆసుపత్రిలో చికిత్స కొరకు అడ్మిట్ చేశారు. అయితే ట్రీట్మెంట్ జరిగినప్పటికి అతను 31వ తేదీన మృతి చెందినట్లు డాక్టర్లు తెలుపడం తో తల్లిదండ్రులు, బంధువులు ఆసుపత్రి ముందు ఆందోళన కు దిగారు. డాక్టర్ల నిర్లక్ష్యం వల్లే రాజ్ కుమార్ వైద్యం వికటించి చనిపోయాడని బంధువులు ఆరోపిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఆసుపత్రికి చేరుకొని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు కాకుండా బాధితులకు న్యాయం చేస్తామని తెలిపారు.