Film
బీర్ పొంగిస్తూ ఖుషీ ఖుషీగా ఛార్మి
Kalinga Times,Hyderabad : ఇస్మార్ట్ శంకర్ సినిమా హిట్ టాక్ వచ్చిన మొదటి షో నుంచే అందరి కంటే ఎక్కువ ఖుషీగా కనిపిస్తోంది ఛార్మినే ఈ నేపథ్యంలో చిత్రయూనిట్‌తో నిన్న జరిగిన మీట్‌లో మాత్రం బీర్ పొంగిస్తూ మరింత హుషారుగా కనిపించింది ఛార్మి. అందుకు కారణం ఈ సారి సెలెబ్రేషన్స్‌లో హీరో రామ్ కూడా జాయిన్ కావడమే. చాలాకాలంగా ఎదురు చూస్తున్న హిట్ పడటమే కాదు, ఊహించిన దాన్ని మించి రెస్పాన్స్ వస్తుండటం డైరెక్టర్ పూరి జగన్నాథ్, నిర్మాత ఛార్మి ఆనందానికి హద్దుల్లేకుండా చేసేసింది. ఇప్పటికే ఇస్మార్ట్ జోష్‌లో రెండు తెలుగు రాష్ట్రాల్లో పర్యటిస్తూ ఫుల్లుగా ఎంజాయ్ చేసిన టీమ్.. గత రాత్రి బీర్ పొంగిస్తూ ఖుషీ ఖుషీ అయింది. అయితే ఇప్పటివరకు చేసిన సంబరాలు ఒకెత్తయితే, రాత్రి జరిగిన ఈ సంబరాలు మరో ఎత్తు అంటోంది ఛార్మి.
Ustaaaad @ramsayz brings energy in #iSmartShankar celebrations 🥳🥳🥳
Feeling the real ISMART BLOCKBUSTER feel now 🤩🥳🤩🥳🤩@purijagan @AgerwalNidhhi @PuriConnects n all our ismart friends 😘😘😘 #PCfilm pic.twitter.com/4qxJbw2Czz
— Charmme Kaur (@Charmmeofficial) July 31, 2019