Religious
శ్రావణమాసానికి అధిదేవత శివుడు
Kalinga Times, Hyderabad : శ్రావణ మాసంలో భారత దేశంలో శివాలయాలు భక్తులతో కిటకిటలాడుతుంటాయి. ఎందుకంటే, శివుడు శ్రావణమాసానికి అధిదేవత. సముద్రమధనం శ్రావణ మాసంలో జరిగినందున శివుడికి అంకితమివ్వబడింది. ఆషాఢ మాసంలో ఏకాదశి నాడు, విష్ణువు నిద్రలోకి జారుకుంటాడు. అతను నాలుగు నెలల నిరంతరం నిద్ర తరువాత, భాధ్రపద మాసంలో దేవుత్తని ఏకాదశినాడు, తిరిగి మేల్కొంటాడు. ఈ నాలుగు నెలలు చతుర్మాసంగా పిలుస్తారు. విష్ణువు నిద్రిస్తున్న ఈ సమయంలో, శివుడు విశ్వాన్ని పోషించే బాధ్యతను తీసుకుంటాడు. గరళాన్ని దిగమింగి ఈ విశ్వాన్ని రక్షించాడు. ఈ పవిత్ర మాసం పరమేశ్వరుని కృపాకటాక్షాలు పొందడానికి చాలా అనుకూలమైన సమయం. భక్తులు, ఉపవాసాలు, పూజలు, వ్రతాలు మరియు దానాల ద్వారా ఆయనను మెప్పించడానికి ప్రయత్నిస్తారు. కావున శ్రావణ మాసంలో చేయకూడనివి ఏమిటో తెలుసుకొందాం
సూర్యోదయానికి ముందే..
శ్రావణ మాసంలో భక్తులందరు శ్రావణ మాసంలో ఆలస్యంగా మేల్కొనకూడదు. బ్రహ్మ ముహూర్త సమయంలో స్నానం చేయాలి. బ్రహ్మ ముహూర్త సమయం సూర్యోదయానికి ముందు ఉదయం 4:00 నుండి 6:00 గంటల మధ్య వస్తుంది. ఈ సమయంలో శరీరంలోని సానుకూల శక్తి క్రియాశీలకంగా మారుతుంది కనుక భక్తులు తమ ఏకాగ్రతను భగవంతునిపై కేంద్రీకరిస్తారు.
పసుపు నిశిద్దం
శ్రావణ మాసంలో పసుపు శివునికి నిశిద్దం పూజ సామగ్రిలో పసుపు ఉండేలా మనం ఎప్పుడు చూసుకుంటాం. స్త్రీ దేవతలకు పసుపును సమర్పిస్తారు. పసుపుతో మహిళలకు విడదీయరాని సంబంధం అందుకే ఉంటుంది. శివుడు తన యదార్ధ రూపంలో యోగి మరియు ఋషి అందువలన, పసుపు అతనికి సమర్పించరాదు. చాలామంది కుంకుమను కూడా సమర్పించరు.
పచ్చి పాలను వాడరాదు
శ్రావణ మాసంలో శివునికి పచ్చిపాల సమర్పించరాదు సాధారణంగా పచ్చి పాలను శివుని అభిషేకానికి ఉపయోగిస్తారు, కానీ శ్రావణ సమయంలో అతనికి పచ్చి పాలు సమర్పించరాదు. మరిగించిన తర్వాత మాత్రమే పాలను పూజకు ఉపయోగించాలి.
వంకాయలు తినరాదు
శ్రావణ మాసంలో ఆకు కూరలు మరియు వంకాయలు అస్సలు తినరాదు పురాతన హిందూ మత గ్రంథాలు, శ్రావణ మాసంలో ఆకు కూరలు మరియు వంకాయలు అస్సలు తినరాదని చెప్తున్నాయి. ఈ నెలలో వీటిని తినడం అశుభంగా నమ్ముతారు గ్రంథాలలో వంకాయలను అశుద్ధమైన కూరగాయలుగా వర్ణించారు.
మాంసాహారం నిషిద్దం
ఈ నెలలో అమాయక జీవులను తిన్నా లేదా చంపినా జీవహత్యగా పరిగణించి హిందూమతం ప్రకారం పాపమని నమ్ముతారు.ఈ నెలలో చెడు ఆలోచనలు మరియు ప్రతికూలతల నుండి దూరంగా ఉండండి. ఇవి మీ ఉపవాస దీక్షను విచ్ఛిన్నం చేసి శివుని అసంతృప్తికి గురిచేస్తుంది.