Telangana
మంచిర్యాల జాయింట్ కలెక్టర్ వాహనానికి 1,000 జరిమానా
కలెక్టర్ వాహనం (TS19 C 1009) స్పీడ్ లేజర్ గన్‌కు దొరికిపోయింది
Kalinga Times,Mancherial : మంచిర్యాల జాయింట్ కలెక్టర్ వాహనం (TS19 C 1009) ఈ నెల 28న సైబర్‌బాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని అల్వాల్ సమీపంలో ఎల్లంపేట దగ్గర స్పీడ్ లేజర్ గన్‌కు దొరికిపోయింది. మితి మీరిన వేగంతో నిబంధనలు ఉల్లంఘించడంతో చలానా విధించారు పోలీసులు. సోషల్ మీడియాలో ఈ చలానాకు సంబంధించిన స్లిప్ వైరల్ అవుతోంది. ఈ కారుకు చలానా కింద.. రూ. 1,000 జరిమానా, యూజర్ చార్జీలు రూ. 35 కలిపితే రూ. 1,035 వచ్చింది. ట్రాఫిక్ పోలీసులు చట్టానికి ఎవరూ అతీతులు కాదని నిరూపించారంటూ నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. రోడ్డు ప్రమాదాల సంఖ్య పెరగడంతో పోలీసులు స్పీడ్ లేజర్ గన్‌లతో వాహనాల వేగాన్ని పర్యవేక్షిస్తున్నారు. మితి మీరిన వేగంతో వెళితే వెంటనే స్పీడ్ లేజర్ పసిగడుతోంది. మంచిర్యాల జాయింట్ కలెక్టర్ వాహనం కూడా అలాగే బుక్కయ్యింది.