Film
ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయించుకోమని చెప్పారు-నటి హేమ
Kalinga Times,Hyderabad : బిగ్ బాస్ షో నుంచి తొలివారమే బయటకు వస్తానని ఊహించలేదు అన్నారు నటి హేమ. హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మీడియా వారంతా ఇంటర్వ్యూలు అడుగుతుండటంతో ఆమె అందరికీ ఒకే చోటకు పిలిచి మంగళవారం ప్రెస్ మీట్ పెట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గూగుల్ ఓటింగ్ కోట్లలో పడ్డాయి. అయితే ఆ ఓట్లు హాట్ స్టార్లో పడక పోవడం నా దురదృష్టం. నా గురించి ఎంతో మంది తమ సోషల్ మీడియా పేజీల్లో పాజిటివ్‌గా పెడుతున్నారు. ఆ విధంగా చూస్తే నేను వారి మనసులు గెలుచుకున్నట్లు, విన్ అయినట్లే లెక్క అని హేమ తెలిపారు. మిమ్మల్ని కూడా వంద రోజులు సెక్స్ లేకుండా ఉంటారా? అని అడిగారా? అనే ప్రశ్నకు హేమ స్పందిస్తూ బిగ్ బాస్ ఇంట్లోకి వెళ్లే ముందు నన్ను ఎలాంటి కాంట్రవర్సల్ ప్రశ్నలు అడగలేదు. అయితే ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయించుకోమని చెప్పారు. ఒక వేళ ప్రెగ్నెన్సీ ఉంటే మూడు నెలలు అక్కడ ఉండాల్సి ఉంటుంది, ఏదైనా జరుగరానిది జరిగితే బిగ్ బాస్ షోకు నష్టం జరుగుతుంది కాబట్టి అలా అడిగారు. దాన్ని నేను తప్పుగా, భూతద్దంలో పెట్టి చూడటం లేదన్నారు.