Andhra Pradesh
ఎపి ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ గా అలి
Kalinga Times, Amaravati : ఎపి ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ గా హాస్యనటుడు అలి నియమితులయ్యారు.. ఈ మేరకు జగన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.. త్వరలోనే అధికారిక ఉత్తర్వులు వెలువడనున్నాయి..రాజమండ్రికి చెందిన ఈ హాస్యనటుడు చాలా కాలం తెలుగుదేశం పార్టీకి అభిమానిగా ఉన్నారు.. 2019 ఎన్నికల సమయంలో ఆయన వైసిపిలో చేరారు.. గుంటూరు టిక్కెట్ ను ఆశించిన అలీకి అక్కడ సమీకరణలతో టిక్కెట్ లభించలేదు.. తాజాగా అతడిని జగన్ ఎపిఎఫ్ డి సి ఛైర్మన్ గా జగన్ నియమించారు.