social
కరీంనగర్ వైద్య శాఖ లోని ఉద్యోగులు టిక్ టాక్ తో సస్పెండ్
Kalinga Times,Karimnager : టిక్ టాక్ యాప్ మోజులో పడి ఉద్యోగులు ఉద్యోగాలు పోగొట్టుకున్నారు. రాష్ట్రంలో ఇలాంటి ఘటనలు వెలుగుచూస్తేనే ఉన్నాయి. మొన్నటి మొన్న ఖమ్మం మున్సిపల్ ఉద్యోగులు టిక్ టిక్ చేసి క్రమ శిక్షణ చర్యలకు లోనయ్యారు. తాజా గా కరీంనగర్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ లోని ఉద్యోగులు టిక్ టాక్ తో సస్పెండ్ అయ్యారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయంలో పనిచేస్తున్న ఇద్దరు జూనియర్ అసిస్టెంట్, ఒక ల్యాబ్ అటెండర్ ను సస్పెండ్ చేస్తూ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ రామ్ మనోహర్ రావు శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ముగ్గురు ఉద్యోగులు కార్యాలయంలో ఆన్ డ్యూటీ లో ఉండి టిక్ టాక్ వీడియో చేశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో దివ్యమణి, సమత, జయలక్ష్మీలను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.