Telangana
కాంగ్రెస్ సీనియర్ నేత జైపాల్‌రెడ్డి మృతి
Kalinga Times,Hyderabad : కేంద్ర మాజీ మంత్రి కాంగ్రెస్ సీనియర్ నేత జైపాల్‌రెడ్డి మృతి చెందారు. గచ్చిబౌలిలోని ఏషియన్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. కాంగ్రెస్ సీనియర్ నేత,మాజీ కేంద్రమంత్రి జైపాల్ రెడ్డి కన్నుమూశారు. కొద్ది రోజులుగా నిమోనియాతో భాదపడుతున్న జైపాల్ రెడ్డి (77) గచ్చిబౌలి ఏషియన్ గ్యాస్ ఎంట్రాలజి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అర్ధరాత్రి 1:28 గంటలకి తుది శ్వాస విడిచారు. జైపాల్ రెడ్డి స్వస్థలం మహబూబ్ నగర్ జిల్లా మాడుగల గ్రామం. 1942 జనవరి 16 న జైపాల్ రెడ్డి జన్మించారు. జైపాల్ రెడ్డి కి భార్య, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. 1969-84 మధ్య నాలుగుసార్లు కల్వకుర్తి ఎమ్మెల్యేగా ఎంపికయ్యారు. 1977 ఎమర్జెన్సీ సమయంలో ఆయన కాంగ్రెస్ ను వీడి జనతాపార్టీ లో చేరారు. 1985-88 వరకు జనతా పార్టీ జనరల్ సెక్రటరీగా పనిచేశారు. 1984లో మహబూబ్ నగర్ నుంచి ఎంపీగా గెలుపు పొందారు. 1990-96 వరకు రాజ్యసభ సభ్యుడిగా జైపాల్ రెడ్డి ఉన్నారు. 1991-92 రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడి హోదా జైపాల్ రెడ్డి నిర్వహించారు. రెండు సార్లు రాజ్యసభ ఎంపీగా పనిచేశారు. 1999 లో తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరారు. 1999-2004 మిర్యాలగూడ లోక్ సభ స్దానం నుంచి గెలుపొందారు. 2009 లో చేవెళ్ళ లోక్ సభ స్ధానం నుంచి ఎంపిగా ఎన్నికయ్యారు. కేంద్రంలో కీలక శాఖలకు కేంద్రమంత్రిగా జైపాల్ రెడ్డి పనిచేశారు. సమాచార శాఖ,సైన్స్ అండ్ టెక్నాలజీ, పట్టణాభివృద్ధి శాఖ ,పెట్రోలియం సహజ వాయువుల మంత్రిత్వ శాఖ,మినిస్ట్రీ ఆప్ ఎర్త్ సైన్స్సెస్ కు మంత్రిగా జైపాల్ రెడ్డి పని చేశారు.