Telangana
శారదా విద్యా నికేతన్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే గాంధీ
Kalinga Times,Hyderabad : శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని స్వాతి రెడ్డి కాలనీ లో శారదా విద్యా నికేతన్ హై స్కూల్ ను శేరిలింగంపల్లి నియోజక వర్గ ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ శనివారం ప్రారంభించారు, ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యార్థులు ఉన్నత చదువులు చదివి అన్ని రంగాలలో ముందుండాలని ఆయన కోరారు. ముఖ్యంగా విద్యార్థుల తల్లిదండ్రులు పిల్లల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపించాలని సూచించారు, ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ రోజీ లతోపాటు ఉపాధ్యాయులు, విద్యార్థులు. వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే విద్యార్థుల సమక్షంలో భోజనాలు చేశారు.