National
ఎలక్ట్రానిక్ వాహనాల జీఎస్టీని 5 శాతానికి తగ్గిస్తూ కీలక నిర్ణయం
Kalinga Times,Delhi : ఎలక్ట్రానిక్ వాహనాల వినియోగదారులకు జీఎస్టీ కౌన్సిల్ శుభవార్త చెప్పింది. వాహనాలు, ఛార్జర్లపై జీఎస్టీని 5 శాతానికి తగ్గిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో వాహనాలపై 12శాతం, ఛార్జర్లపై 18 శాతం జీఎస్టీ ఉండేది. తాజా రేట్లు ఆగస్టు నుంచి అమల్లోకి రానున్నాయి. అదేవిధంగా స్థానిక ప్రభుత్వ విభాగాలు విద్యుత్తు బస్సులను అద్దెకు తీసుకుంటే.. వాటిపై జీఎస్టీని మినహాయింపునిచ్చారు. కేంద్రం బడ్జెట్ ప్రవేపెట్టిన తరవాత తొలిసారి జరిగిన సమావేశంలో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్, సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ సహా పలువురు అధికారులు పాల్గొన్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీతారామన్ ఈ సమావేశాన్ని నిర్వహించారు