Telangana
మాజీ ఎంపీ జి.వివేక్ అమిత్ షా సమక్షంలో బీజేపీలోకి
Kalinga Times,Hyderabad : పెద్దపల్లి మాజీ ఎంపీ జి.వివేక్ టిఆర్ఎస్ పార్టీకి షాక్ ఇవ్వనున్నారు . టీఆర్ఎస్ పార్టీకి రాజేనామా చేసి గత కొంత కాలంగా ఆయన టిఆర్ఎస్ పార్టీ కార్యకలాపాలకు చాలా దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. ఈనెల 23న ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాను కలవనున్నారు వివేక్. అక్కడ అమిత్ షా సమక్షంలోనే వివేక్ బీజేపీలో చేరనున్నారని సమాచారం. ఎన్నికల నాటి నుండి చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో వివేక్ కి టికెట్ వస్తుందని అందరు కూడా భావించినప్పటికీ టిఆర్ఎస్ అధిష్టానం మాత్రం వివేక్ కి టికెట్ ఇవ్వలేదు. అందుకనే మనస్తాపం చెందిన వివేక్ టీఆర్ఎస్ ప్రభుత్వం తనకు ఇచ్చిన ప్రభుత్వ సలహాదారు పదవికి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ప్రతీకారం తీర్చుకునే పనిలో బీజేపీలో చేరుతున్న వివేక్ ఇప్పుడు బీజేపీలో చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. అయితే వివేక్ నిర్ణయంతో టిఆర్ఎస్ నేతలు షాక్ తిన్నారు..
మాజి ఎంపి వివేక్ అమిత్ షా
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కలిశారు మాజీ ఎంపీ జీ. వివేక్ వెంకటస్వామి. రాష్ట్రంలో హెరిటేజ్ భవనాల కూల్చివేత, కొత్త సెక్రటేరియట్ నిర్మాణంపై ఫిర్యాదు చేశారు.. పాతది కూల్చి …కొత్తది కట్టడం అంటే…ప్రజాధనం దుర్వినియోగం చేయడమేనన్నారు. దీన్ని అడ్డుకోవాలని కేంద్ర హోం మంత్రి షాను కోరారు. ప్రభుత్వ తీరుపై ఇటీవల నిర్వహించిన… ఆల్ పార్టీ మీటింగ్ తీర్మానాలను వివరించారు. తెలంగాణ రాష్ట్రానికి లక్షా 82 వేల కోట్ల అప్పులు ఉన్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. దళితులకు మూడెకరాలు, బలహీన వర్గాలకు డబుల్ బెడ్ రూం ఇళ్ల హామీ మర్చిపోయారన్నారు. వేల కోట్ల ప్రజాధనం వృధా చేస్తున్నారన్నారు షాకు ఫిర్యాదు చేశారు వివేక్ వెంకట్ స్వామి