Telangana
మంచిర్యాల పోలీస్ పత్రికా ప్రకటన
Kalinga Times,Hyderabad : ప్రతి సంవత్సరం నిర్వహించే క్వారీ జతర పట్ల ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ప్రత్యేక బలగాలతో పటిష్ట భద్రత ఏర్పాటు చెయ్యడం జరుగుతుందని మంచిర్యాల పోలీస్ పత్రికా ప్రకటన ద్వార తెలిపారు. మూడు చోట్ల డ్రంక్ అండ్ డ్రైవ్ లు,అలాగే వాహనాల తనిఖీలు నిర్వహించబడతాయని పేర్కొన్నారు. పార్కింగ్ స్థలలలో వాహనాలను నిలపని వారికి ఇ చాలన్ ద్వారా మీకు తెలియకుండానే మీరు చేసిన పొరపాటుకు ఫైన్ విధించడం జరుగుతుంది. గొడవలకు పాల్పడితే ఉపేక్షించేది లేదు అన్నారు తక్షణమే వారి పై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.సాయంత్రం 3 గంటల తరువాత జాతరను ముగించుకోవలన్నారు.చిన్న చితక వ్యాపారస్తులు తమ వ్యాపార వాహనాలను రోడ్డుకు అడ్డంగా పెట్టడం ద్వారా వాహనాల రాకపోకలకు ఇబ్బందికరంగా మారుతుంది కావున వారుకుడా తమ వ్యాపారం రోడ్డు ఇరువైపులకు దూరంగా పెట్టుకోవలని సూచించడం జరుగుతుంది.అలాగే యువకులు ఎలాంటి సాహసాలకు వెళ్లకుండా ఫోన్ సెల్ఫీల విషయంలో,చెరువుల దగ్గర వెళ్లే విషయంలో జాగ్రత్తగా ఉండాలన్నారు. గతంలో ఇలాంటి చర్యలు వల్ల యువకులు చనిపోయిన సంఘటనలు ఉన్నాయని సూచించడం జరుగుతుందన్నారు.ప్రతి ఒక్కరు జాతరను శాంతి యుతంగా జరుపుకోవాలన్నరు.ప్రజల శాంతి భద్రతలే పోలీస్ యొక్క ముఖ్యలక్షణం అన్నారు