Religious

శని దేవునికి ఇష్టమైన దేవుడు శ్రీకృష్ణుడు

Kalinga Times,Hyderabad : శని దేవుని ప్రతికూల ప్రభావాల బారిన పడడం సర్వసాధారణంగా ఉంటుంది. శని దేవుడు ఎవరినైనా చూడాలని నిర్ణయించుకుంటే, ఆ వ్యక్తి ఖచ్చితంగా నాశనం చేయబడతాడు. అలాగని శని దేవుడు క్రూరమైన దేవుడేమీ కాదు. కానీ ఎందుకు ఇలా జరుగుతుంది? తన భక్తులను ఆశీర్వదించటానికి శని దేవుడు నిర్ణయం తీసుకున్నప్పుడు, వారి జీవితం అద్బుతంగా మలచబడుతుంది. శని దేవునికి వరుసగా, ద్వాజిని, ధామిని, కంకాలి, కలహప్రియ, కంటకి, తురంగి, మహిషి మరియు అజా అనే ఎనిమిది మంది భార్యలు ఉన్నారని చెప్పబడింది. శని దేవుని పూజించే ముందుగా అతని భార్యల పేర్లను కూడా శాంతింపచేయవలసి ఉంటుంది. శనివారం వారి పేర్లమీద పూజలు చేయడం అత్యంత ఉపయోగకరంగా ఉంటుందని తెలుపబడింది. శని దేవుని దృష్టి హానికరమైనదిగా భావించడానికి, అతని భార్య ధామినీతో జరిగిన సంఘటనతో సంబంధం కలిగి ఉందని కథనం.

సూర్య దేవుడు మరియు అతని భార్య ఛాయాదేవి దంపతుల కుమారుడు శని దేవుడు. చీకటి రంగుతో మరియు ఇనుముతో చేసిన రథాన్ని నడుపుతూ, రాబందు వాహనదారుడై ఉంటాడని చెప్పబడింది. తన చిన్ననాటి నుండి శని దేవుడు, శ్రీకృష్ణునికి ఉత్తమ భక్తుని వలె ఉన్నాడు. కృష్ణుని ఆశీస్సుల కొరకు, అధిక కాలం పాటు తపస్సును, ద్యానాన్ని అనుసరించాడు కూడా. తనతో పాటు, కృష్ణుడిపై ఉన్న ప్రేమ కూడా అంచలంచెలుగా పెరిగింది.

పెద్దవాడైన తరువాత, అతను చిత్రరధుని కుమార్తె దామినిని వివాహం చేసుకున్నాడు. ఆమె దైవిక శక్తులు ఉన్న స్త్రీగా చెప్పబడింది. అందంలోనే కాకుండా, అత్యంత తెలివైనదిగా కూడా. ఒక బిడ్డను కలిగి ఉండాలనే కోరిక బలంగా కలిగి ఉండేది దామిని అనేక ఆలోచనల నడుమ, ఒక పిల్లవానికి తల్లిగా ఉండాలనే కోరికను బలంగా కలిగి ఉండేది దామిని. ఆ కోరికతోనే, శనిదేవుని సమీపించగా, ఆ సమయంలో శ్రీకృష్ణుడి ధ్యానంలో ఉన్నాడు శని దేవుడు. ఆ ద్యానం నుండి బయటకు రావడానికి కూడా శని దేవుడు ఇష్టపడలేదు. అప్పటికీ, ఆమె, అతన్ని ధ్యానం నుండి మేల్కొలపాలనే ప్రయత్నం చేసింది, కానీ ఆమె ప్రయత్నాలన్నీ వ్యర్థమయ్యాయి.

దామినీ, శని దేవునికి ఇచ్చిన శాపం
శని దేవునికి ప్రవర్తనతో బాధపడిన దామినీ, తాను మాట్లాడాలని కోరినప్పుడు ఆమెను చూడని కారణాన, అతని ఎదురుగా నిలబడి, ఎవరు చూసినా వారు నాశనం కాబడుతారని శపించింది. ఆమె తరచుగా అడిగిన అభ్యర్థనలను నిర్లక్ష్యం చేసిన కారణాన, అతని దృష్టి ప్రజలకు ఎల్లప్పుడూ ప్రతికూల ప్రభావాలను తీసుకుని వస్తుందని చెప్పబడింది. క్రమంగా శని దేవుడు ఎవరిని చూస్తే, ఆ వ్యక్తి కొన్ని క్లిష్ట సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుందని చెప్పాబడింది. బహుశా శని దేవుడు చెడు కాదు కానీ ఒక వ్యక్తిపై అతని దృష్టి మాత్రం హానికరమైనది కావచ్చునని అర్ధం కావొచ్చునని ఒక విశ్లేషణ.

శని దేవుడు ద్యానం నుండి కళ్ళు తెరిచినప్పుడు, తన బార్య చిరాకు, కోపాన్ని గమనించి, ఆమెకు క్షమాపణ చెప్పాలని ప్రయత్నించాడు. క్రమంగా ఆమె దానిని అర్థం చేసుకుని, శాపం ఇచ్చినందుకు విచారం వ్యక్తం చేసినప్పటికీ, శాపం యొక్క ప్రభావాలను రద్దు చేయగల శక్తులు ఆమెకి లేని కారణంగా, ఆ శాపం కొనసాగించబడింది. అయినప్పటికీ, తన భక్తులు కాపాడబడాలని కోరుకున్న కారణంగా, వారిని చూడకుండా ఎల్లప్పుడూ తల దించుకునే ఉండాలని నిర్ణయించుకున్నాడు. శని దేవుని ఎదురుగ్గా చేరి చూడడం మానవ తప్పిదమే అవుతుంది కానీ, శని దేవుని తప్పు కాజాలదు అని చెప్పబడింది. కావున నవగ్రహారాధాన చేసే సమయంలో కూడా, తల దించుకునే ఆరాధించవలసినదిగా సూచించడం జరుగుతుంది. అంతేకాకుండా, దేవుని దర్శించుకున్న తర్వాతనే నవగ్రహారాధన కూడా చేయవలసి ఉంటుంది. నవగ్రహాలకు ప్రధాన దేవునికి ఇచ్చిన విలువ ఇవ్వరాదని కూడా నియమం ఉంది. కావున, నవగ్రహాలను, ముఖ్యంగా శని దేవుని శాంతింపజేయుటలో పండితుల సూచనలు తీసుకుని అడుగులు ముందుకు వేయవలసి ఉంటుంది.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close