Telangana

టీఆర్ఎస్‌లో కలవరం పుట్టించడానికి డీకే అరుణ ప్లాన్

Kalinga Times,Hyderabad : ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో డీకే అరుణ కాషాయ కండువా వేసుకోవడం పెద్ద కలకలమే రేపింది. సార్వత్రిక ఎన్నికలు సమీపించిన వేళ గత లోక్‌సభలో టీఆర్ఎస్ సభాపక్ష నేత జితేందర్ రెడ్డి కూడా సొంతకూటికి వచ్చేశారు. దీంతో మహబూబ్‌నగర్ ఎంపీ స్థానం తమదే అని బీజేపీ చాలా ధీమాను ప్రదర్శించింది. కానీ డీకే అరుణ ఓటమిపాలైంది. జాతీయ పార్టీలో సీనియర్ నేత, మాజీ మంత్రి అయిన డీకే అరుణ పార్టీలో చేరిన ప్రయోజనం లేకుండా పోయిందన్న వార్తలు ఒక్కసారిగా పెరగడంతో ఆమె తీవ్ర అసంతృప్తికి గురైనట్లు తెలుస్తోంది. వెంటనే ఆపరేషన్ టీఆర్ఎస్ మొదలుపెట్టారట.
తన బలాన్ని నిరూపించుకోవాలని పట్టుబట్టిన డీకే అరుణ టీఆర్ఎస్ ముఖ్యనేతలకు కాషాయకండువా కప్పే పనిలో బిజీగా ఉన్నారట. ఈ క్రమంలోనే టీఆర్ఎస్‌లో ప్రాధాన్యత దొరకక ఇబ్బంది పడుతోన్న లీడర్లను టార్గెట్ చేశారట. టీఆర్ఎస్ పార్టీలోని ఒక ప్రముఖ నేతతో పాటుగా ఒక ప్రజాప్రతినిధి కూడా డీకే అరుణతో రహస్య మంతనాలు జరుపుతున్నారని తెలుస్తోంది. అటు జోగులాంబ గద్వాల, మహబూబ్‌నగర్ జిల్లాల మీద ఫోకస్ పెట్టిన డీకే అరుణ మున్సిపల్ ఎన్నికలకు ముందే టీఆర్ఎస్‌లో కలవరం పుట్టించడానికి ప్లాన్ చేస్తున్నారట. ద్వితీయ స్థాయి నేతలకు కాషాయ కండువాలు వేసి ఆ తర్వాత బడా నేతలకు వెల్‌కమ్ సాంగ్ ప్లే చేయాలని భావిస్తున్నారట. అయితే డీకే అరుణ వ్యూహాలను నిశితంగా గమనిస్తున్న టీఆర్ఎస్ అధిష్టానం ఆమెతో టచ్‌లో ఉన్న గులాబీ కండువాలు ఎవరన్నది ఆరా తీస్తోందట.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close