Film
పారితోషికాన్ని భారీగా పెంచేశాననడంలో నిజం లేదు
Kalinga Times,Hyderabad : టాలీవుడ్ లో రకుల్ తరువాత ఆ స్థాయిలో దూసుకొచ్చిన కథానాయికగా రష్మిక మందన కనిపిస్తోంది. ప్రస్తుతం ఆమె నితిన్ జోడీగా ‘భీష్మ’ మహేశ్ బాబు సరసన నాయకిగా ‘సరిలేరు నీకెవ్వరు’ చేస్తోంది. తమిళ స్టార్ హీరో విజయ్ తదుపరి సినిమాలో నాయికగాను ఛాన్స్ కొట్టేసే అవకాశాలు ఎక్కువగా వున్నాయనే టాక్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో రష్మిక తన పారితోషికం బాగా పెంచేసిందనే ప్రచారం జోరుగా జరుగుతోంది. తాజాగా ఈ విషయంపై రష్మిక స్పందిస్తూ “నేను నా పారితోషికాన్ని భారీగా పెంచేశాననడంలో నిజం లేదు. నాకు గల సక్సెస్ రేటును బట్టి ,క్రేజ్ ను బట్టే తీసుకుంటున్నాను. నా పారితోషికం ఎప్పుడూ నా కష్టానికి తగినట్టుగానే ఉంటుంది” అంటూ చెప్పుకొచ్చింది.