Andhra Pradesh
పాప ఆరోగ్యం కోసం ఎంతైనా ప్రభుత్వమే భరిస్తుంది
ఎనిమిది నెలల పసిపాప పర్ణిక వ్యవహారంలో సీఎం స్పందన
Kalinga Times,Amaravati: పేగువ్యాధితో బాధపడుతున్న ఎనిమిది నెలల పసిపాప పర్ణిక వ్యవహారంలో సీఎం జగన్మోహన్ రెడ్డి స్పందించారు. విశాఖ జిల్లా గాజువాకకు చెందిన దంపతులు తమ 8 నెలల పాపను దక్కించుకోవడం కోసం వారం రోజుల నుండి సీఎం జగన్మోహన్ రెడ్డిని కలిసేందుకు ప్రయత్నించారు. అయితే అక్కడ ఎవరూ తమను పట్టించుకోవడం లేదని ముఖ్యమంత్రిని కలిసేందుకు అనుమతి ఇవ్వడం లేదని కన్నీటి పర్యంతమైన కథనాలు ప్రసార మాధ్యమాలలో రావడంతో సీఎం స్పందించారు. పాప ఆరోగ్యం కోసం ఎంతైనా ప్రభుత్వమే భరిస్తుందని పాపకు వైద్యం అందించాలని సీఎంఓ కార్యాలయం నుండి ఆసుపత్రికి ఆదేశాలు జారీ చేశారు.