social

వెన్ను నొప్పి వస్తే మళ్లీ మళ్లీ వచ్చే అవకా శం

Kalinga Times,Hyderabad : ఒకసారి వెన్ను నొప్పి వస్తే మళ్లీ మళ్లీ వచ్చే అవకా శం ఉంది. ఇలా జరుగకుండా ఉండాలంటే, నడుమును దృఢం గా, బలంగా ఉంచుకోవాలి. నడుమును ఎటుపడితే అటు, ఎలా పడితే అలా సాగదీయగలగాలి. నడుము నొప్పికి దారితీసే అన్ని కారణాలనూ, భంగిమలనూ క్షుణ్ణంగా తెలుసుకోవాలి. నివారణ పద్ధతులను పాటించాలి. వెన్నునొప్పి కొత్తగా వచ్చిన దైతే వేదనాహర చర్యలు, చికిత్సలు, మందుల వంటివి సరిపో తాయి. పూర్తిస్థాయి విశ్రాంతి కూడా అద్భుత ఫలితాన్ని ఇస్తుం ది. అయితే మరీ ఎక్కువ రోజులు పడుకోవడం మంచిది కాదు. నడుము కండరాలు తిరిగి బలంగా, ఆరోగ్యంగా తయారవ్వా లంటే సాధ్యమైనంత నిర్దేశిత వ్యాయామాలు చేయాలి.సూచించిన ఔషధా లు వాడాలి.

ఒకవేళ నొప్పి మరీ తీవ్రంగా ఉండి ఎన్ని రోజులైన ప్పటికీ తగ్గకపోతే ఇక ఆలస్యం చేయకూడదు. వైద్య సహాయం పొందాలి. వైద్యులు అవసరమైన పరీక్షలు చేసి వెన్నునొప్పికి కారణాన్ని కనుగొనే ప్రయత్నం చేస్తారు. అవసరమైతే, శమనౌష ధాలతో పాటు స్వేహ, స్వేద, వస్తి కర్మలు, కటివస్తి, అభ్యంగ నం వంటి ప్రత్యేక చికిత్సా పద్ధతులను సూచిస్తారు.

ఉపశమన మార్గం: వెన్నునొప్పి నెలల తరబడి బాధిస్తున్నట్ల యితే కోలుకోవడానికి మీకు వైద్య సహాయం అవసరమవు తుంది. దీనికి ‘వేదానస్థాపన చర్యలు అవసరమ వుతాయి. నొప్పిని నియంత్రించడం, నొప్పి తీవ్రతను తగ్గించడం, నొప్పిని నివారిం చడం, నొప్పితో సౌకర్యవం తంగా జీవించడం అనేవి ఆయుర్వేద చికిత్సలో ప్రధానాంశాలు. నడుము నొప్పిని ఆయు ర్వదంలో కటి శూల అంటారు. ఇది వాత ప్రధాన వ్యాధి. దీనిలో పాటించే చికిత్సా సూత్రాలు

స్నేహనం : ఔషధ సిద్ధ తైలాలను నులివెచ్చగా ప్రయోగించడం దీనిలో ప్రధా§నాంశం. తైలం అనేది బిగుసుకుపోయిన కండరాల్లో చల నాన్ని తెస్తుంది. కటి వస్తి అనే చికిత్సా ప్రక్రియ దీనిలో అంతర్భాగమే.ఈ విధానంలో బాధితుడిని బోర్లా పడుకోబెట్టి నడుముభాగంలో మినపపిండితో వర్తులాకారంలో గోడను నిర్మించి దానిలో ఔషధ తైలాలను వేడి చేసి నిర్ణీతకాలం ఉంచుతారు.
స్వేదనం : చెమట పుట్టేలా చేయటం ఈ చికిత్సల ప్రధాన ఉద్దేశ్యం. కండరాల్లో వేడిని పుట్టించడం వల్ల అంత తేలికగా ఒక దాని మీద మరొకటి జారుతాయి. శరీరంలో వేడి పెరిగినందువల్ల రక్త ప్రవాహం పెరుగుతుంది. కణాంతర్గత మలినాలు త్వరితంగా విసర్జితమవుతాయి. ఈ చర్యలతో ఉపశమనం లభిస్తుంది.
అగ్ని దీపనం : ఆహార పాచన శక్తి తగ్గడం వల్ల పొట్ట ఉబ్బరి స్తుంది. దీనితో వెన్ను మీద ఒత్తిడి ఎక్కువ అవుతుంది. అగ్నిదీ పనం అనే చికిత్సా ప్రక్రియతో ఈ సమస్యనుంచి బైటపడవచ్చు.
వస్తికర్మ : ఇది నడుము నొప్పిలో అత్యు త్తమంగా పని చేసే విధానం. పంచకర్మల్లో ముఖ్యమైనది. దీనిలో ఔషధ సిద్ధ తైలాలను, వాతహర కషాయాలను ఎనిమా రూపంలో ప్రయోగించడం జరుగుతుంది.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close