social
ఘనంగా గురుపౌర్ణమి వేడుకలు
Kalinga Times,Hyderabad : దేశ వ్యాప్తంగా గురుపౌర్ణమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. గురుపౌర్ణమి సందర్భంగా అన్ని సాయిబాబా ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ప్రముఖ సాయిబాబా ఆలయాల్లో భక్తుల రద్దీ పెరిగింది. తెల్లవారు జాము నుంచే సాయిబాబా ఆలయాలకు భక్తులు తరలివస్తున్నారు. సాయిబాబా ఆలయాలకు భారీ సంఖ్యల్లో భక్తులు తరలిరావడంతో ఆలయాలు, పరిసర ప్రాంతాలు కిటకిటలాడుతున్నాయి. సాయినాథుడికి భక్తులు ప్రత్యేక పూజలు, క్షీరాభిషేకాలు చేస్తున్నారు.