Religious

మాతృమూర్తి అయి సృష్టికి కారకురాలైనది లలితా పరమేశ్వరి

Kalinga Times,Hyderabad : లోకాలను మించి అతి లోక లావణ్యముతో లాస్యము చేసే లలితామణి ఆమెయే లలితా పరమేశ్వరి. ఎరుపు రంగు దుస్తులు కట్టుకొన్న, ప్రేమమయ చూపులు కలిగి పాశము, అంకుశం, పుష్పం చెరకు గడను నాలుగు చేతులలో ధరించి అణిమాది సిద్ధులను కలిగిన శివ్ఞని భార్య అయిన భవానియే లలిత. రావణుని చంపాలంటే ఆదిత్య హృదయ పారాయణం చేస్తేనే సాధ్యం. ఆ మహామంత్రాన్ని శ్రీరాముడికి చెప్పిన వారు అగస్త్య మహాముని. అటువంటి అగస్త్య మహాముని ఆత్మతత్వమును తెలుసుకోవాలనుకుంటాడు. ఆ విషయం ఎంత త్వరగా తెలుసుకుంటే జీవ్ఞడు అంత త్వరగా పరమాత్మను చేరుకుంటాడు.

జనన మరణ జంఝాటం నుండి తప్పించుకోగలుగుతాడు. అందుకుగాను అగస్త్య మహాముని శ్రీలలితను స్మరించేందుకు నామతారకమును అనుగ్రహించవలసినదిగా హయగ్రీవ్ఞడు అను మహామునిని కోరుతాడు. ఏ పేరిట పిలిస్తే, ఆ తల్లి పలుకు తుందో ఆ పేర్లన్నీ హయగ్రీవ్ఞని అశ్వకంఠముతో ఆశువ్ఞగా వస్తాయి. ఈనామ సహస్రమే లలితా సహస్రం. ఇవి వేయినామాలు. ఇందులో కామాక్షి,పార్వతి, దుర్గ, మహాకాళి, సరస్వతి, భవాని, నారాయణి, కల్యాణి, రాజరాజేశ్వరి మహాత్రిపురసుందరి, వైష్ణవి, మహేశ్వరి, చండికా, విశాలాక్షి, గాయిత్రి అనేక దేవి రూపాలు కనపడతాయి. శ్రీలలితా సహస్రనామములు కేవలం స్తోత్రం కాదు.

ఇది గొప్ప శాస్త్రము. గొప్ప ప్రమాణం. ఈ వేయినామాలు 183 శ్లోకములలో చెప్పబడినవి. ‘శ్రీమాతా అను నామముతో మొదలై లలితాంబికా అనునామముతో పూర్తవ్ఞతుంది. విడివిడిగా చదువుతే ఓం శ్రీమాత్రేనమః అని చదవాలి. అర్థము తెలుసుకునే చదవాలి. అలా వీలుకానప్పుడు నామజపము వలె చదవాలి. ఎలా చదివినా భక్తితో చదివితే పుణ్యం వస్తుంది. ‘

శ్రీమాత ఈ నామముతో మొదలవ్ఞతుంది. ఈ నామమము వివరణ ఇవ్వబడుతున్నది. ‘శ్రీమాతా శ్రీదేవి మాతృమూర్తి అయి సృష్టికి కారకురాలైనది. తల్లి, తండ్రి, గురువ్ఞ రూపములో వ్ఞన్నది. శ్రీఅంటే లక్ష్మి. ‘మా అన్న లక్ష్మీయే. మాతృ సహజమైన మమకారం అందిస్తుంది. ప్రేమతో కూడిన కాఠిన్యం ప్రదర్శిస్తూ సమస్తప్రాణి కోటిని సరిదిద్దుతుంది. ప్రతినామము ఒక మంత్రం. ఈ నామములు చదివితే జీవితం తరిస్తుంది. అపమృత్యువ్ఞ పోతుంది. ఆయుష్షు పెరుగుతుంది. ఆరోగ్యం బాగుంటుంది. సర్వపాపాలు తొలగిపోతాయి. ఇంతకు మించిన ఆనందం మరొకటి ఉండదు. అందుకే శ్రీలలితా సహస్రనామాలు చదువ్ఞదాం. చదివించుదాం.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close