National
వీల్ రైడ్ కూలి ఇద్దరు మృతి వీడియో వైరల్
Kalinga Times,Hyderabad : అహ్మదాబాద్‌లోని కంకారియా చెరువు వద్ద ఉన్న ఎమ్యూజ్మెంట్ పార్క్‌లో ఒక వీల్ రైడ్ కూలిపోయింది. అడ్వెంచర్ పార్కులో ఈ ఘటన చోటు చేసుకుంది.సరదాగా అలా పార్క్ వెళ్లిన ఇద్దరు వ్యక్తులు అనూహ్యంగా ఇక తిరిగి రాని లోకాలకు తరలి పోయారు. మరో 29 మంది తీవ్ర గాయాల పాలయ్యారు. ప్రాణాలతో బయటపడిన వారిని మణినగర్‌లోని ఎల్జీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నామని నగర మేయర్ బిజాల్ పటేల్ తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టామని అహ్మదాబాద్ మునిసిపల్ కమిషనర్ విజయ్ నెహ్రా తెలిపారు. ప్రధాన షాఫ్ట్ పైపు విరిగి నేలమీద కుప్పకూలిందని, దీనిపై ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ (ఎఫ్ఎస్ఎల్) దర్యాప్తు చేస్తోందని చీఫ్ ఫైర్ ఆఫీసర్ దస్తూర్ వెల్లడించారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది.
Watch: Amusement park ride collapses in Ahmedabad's Kankaria Lake area pic.twitter.com/hFwW64eIXA
— DNA (@dna) July 14, 2019