social
ముస్తాబవుతున్న శ్రీ మహాంకాళీ దేవాలయం
Kalinga Times,Hyderabad : కంటోన్మెంట్సి సికింద్రాబాద్ లోని చారిత్రాత్మకమైన శ్రీ ఉజ్జయినీ మహాంకాళీ దేవాలయం ఆషాడ బోనాల జాతర కోసం ముస్తాబవుతోంది. బోనాల పండుగను పురష్కరించుకొని అమ్మవారి దేవాలయాన్ని వివిద రంగులతో,విద్యుత్ దీపాలతో పూలతో ఎంతో అందంగా తీర్చి దిద్దుతున్నారు.బోనాల పండుగను రాష్ట్ర పండుగగా నిర్వహించడంతో దేవాదాయ శాఖ ప్రత్యేకంగా నిధులు కేటాయించి,భక్తులకు సకల సౌకాలు కల్పించి,దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉండకుండా అనేక ఏర్పాట్లు అధికార యంత్రాంగ చేప్పట్టింది.
జూలై 21న ఆదివారం ప్రారంభం కానున్న జాతరను పురష్కరించుకని జీహెచ్ఎంసీ,విద్యుత్ శాఖ,వాటర్ వర్క్స్ తదితర ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పలు ఏర్పాట్లు చేస్తున్నాయి. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లలో నిమగ్న మయ్యారు .రవాణ,వైద్య సదుపాయాలతో పాటు స్వచ్చంధ సంస్థల ప్రతినిధులు జాతర విజయవంతానికి ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు.
బోనాల మరుసటి రోజు సోమవారం నాడు రంగం కార్యక్రమం జరుగనుంది. కుమారి స్వరూప దేవాలయంలో ఏర్పాటు చేయనున్న పచ్చి కుండపై నిల్చోని భవిశ్యవాణి వినిపించనుంది.బోనాల సందర్భంగా మధ్యాహన్నం నుంచి నిర్వాహకులు ఫలహారపు బండ్లు ఉరేగింపులు నిర్వహించనున్నారు.అలాగే పోతరాజులు డప్పు వాయిద్యాలకు లయబద్దంగా నృత్యాలు,కోయవేశాలు,గిరిజనల వేశాలతో నృత్య కార్యక్రమాలు జరుగనున్నాయని ఈ జాతర వేడుకలు పర్యవేక్షిస్తున్న స్థానిక ఎంఎల్ఏ,రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మీడియాకు తెలిపారు.
ప్రత్యేక పూజలు-రామతీర్థ శాస్త్రి
ఈ బోనాల పండుగ పురష్కరించుకొని శ్రీ మహాంకాళీ అమ్మవారికి ప్రతిరోజు వివిద రకాలుగా అలంకరిస్తు, పూజలు నిర్వహించడం జరుగుతోందని దేవాలయం ప్రధాన అర్చకుడు రామతీర్థ శాస్త్రీ మీడీయాకు వివరించారు. 200సంవత్సరాల క్రితం ఉజ్జయినీ దేవాలయం నుండి అమ్మవారని తీసుకవచ్చి ఇక్కడ ప్రతిష్టించడం జరిగిందని ఆనాటి నుండి గా మహంకాళి అమ్మవారు భక్తుల కోరికలు నెరవెర్చే తల్లిగా ప్రసిద్ధి చెందినన్నారు. మహాంకాళీ అమ్మ వారి ఉత్సవాల కోసం రాష్ట్ర నలుమూలలనుంచి భక్తులు విచ్చేసి దర్శనం చేసుకొని తమతమ మొక్కులు నెరవేర్చుకొంటారు. ఆలయ చరిత్ర, పూజల విషేశాలను ఈ సందర్భంగా ఆయన వివరించారు. ప్రశాంత వాతవరణంలో భక్తులు ఘనంగా బోనాల పండుగ నిర్వహించు కోవాలని రామతీర్థ శాస్త్రి కోరారు.