National
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రాష్ట్రపతి
Kalinga Times,Hyderabad : తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ దర్శించుకున్నారు. సతీసమేతంగా ఆలయానికి చేరుకున్న రాష్ట్రపతి రామ్‌నాథ్‌కోవింద్‌కు ఆలయ ద్వారం వద్ద ఆలయ అర్చకులు, టీటీడీ అధికారులు స్వాగతం పలికారు. అనంతరం స్వామివారి దర్శన ఏర్పాట్లు చేశారు. రాష్ట్రపతితో పాటు గవర్నర్ నరసింహన్ దంపతులు కూడా శ్రీవారి సేవలో పాల్గొన్నారు. అంతకు ముందు క్షేత్ర సాంప్రదాయాన్ని పాటిస్తూ ముందుగా రాష్ట్రపతి వరాహస్వామిని దర్శించుకున్నారు. మధ్యాహ్నం 3.30 గంటలకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ శ్రీహరికోటకు వెళ్లనున్నారు.