
Kalinga Times,Hyderabad : ‘థర్టీ ఇయర్ ఇండ్రస్టీ’ అంటూ చలన చిత్ర అభిమానులను కడుపుబ్బ నవ్వించిన నటుడు పృద్వీకి ఏపి సిఎం జగన్ కీలక పదవి ఇచ్చారు. తిరుమల శ్రీవారి ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటుతున్న శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానెల్‌కు (ఎస్‌వీబీసీ) చైర్మన్‌గా నియమించారు. తనను నమ్మిన వాళ్లకు జగన్ న్యాయం చేస్తారని మరోసారి నిరూపించుకున్నారు. పృద్వీకి కీలక పదవి కట్టబెట్టడంతో తెలుగు చిత్ర పరిశ్రమ జగన్‌కు కృతజ్ఞతలు తెలిపింది.