social
అమర్ నాథ్ యాత్ర ను తలపించే చామలపల్లి శివాలయం
Kalinga Times,Hyderabad : తొలి ఏకాదశి సందర్భంగా భక్తులంతా చామలపల్లి గ్రామంలో సాహసోపేతమైన శివాలయ దివ్య దర్శనము చేసుకున్నారు. మరో అమర్ నాథ్ యాత్ర ను తలపించే దైవ క్షేత్రం నల్గొండ జిల్లా చండూర్ మండలం లోని చామలపల్లి గ్రామంలో పురాతన శివాలయం ఉంది. ఇక్కడ ప్రతి సంవత్సరం తొలి ఏకాదశి రోజున మాత్రమే స్వామి వారి దర్శన భాగ్యం కలుగుతుంది. ఊరి చివర ఉన్న అతి పెద్ద కొండ పైన వెలిసిన మహా శివలింగాన్ని దర్శించడం కోసం ఈ కొండ పైకి వెళ్లి స్వామి వారిని దర్శించుకోవడం అంటే ధైర్యం కావాల్సిందే ఒక్క అడుగు కాలు జారిన పాతాళానికి పడాల్సిందే..అడుగు అడుగు కి రాళ్లు,చెట్లు. కాలు కూడా సరిగ్గా పెట్టలేని పరిస్థితి. స్వామి దర్శనం చేసుకుని , కొండ పైన ఉన్న కోనేరు నీటిని తల పై చల్లుకుంటే కోరుకున్న కోర్కెలు నెరవేరుతాయని,ఎలాంటి జబ్బులు రావని భక్త్తుల నమ్మకం.మహిళలు, వృద్ధులు, చిన్న పిల్లలు సైతం కొండ మీద కు వెళ్తారు.చుట్టుపక్కల ఉన్న మండలాలే కాకా నల్గొండ జిల్లా నుండి స్వామి వారి దర్శనం కోసం భక్తులు వస్తుంటారు.