Telangana
తెలంగాణలో సార్వజనీన ఆరోగ్య సంరక్షణ పథకం
Kalinga Times,Hyderabad : తెలంగాణ ప్రభుత్వం కంటి వెలుగు పథకంతో ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి, కంటి అద్దాలు, మందులు అందించింది. ఐతే ఇప్పుడు మరో వినూత్న పథకానికి శ్రీకారం చుట్టబోతుంది. తెలంగాణలో అనేక వ్యాధులతో బాధపడుతున్న అందరికి ఉచిత వైద్యం అందించే దిశగా ఓ బృహత్తర కార్యక్రమం చేపట్టబోతుంది. ఈ పథకం నేరుగా ప్రజల్లోకి వెళ్లగలిగితే ప్రభుత్వం పట్ల ప్రజల్లో ఆదరణ పెరుగుతుంది. అలోచన మంచిదైనా ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. రాష్ట్రంలో కొత్తగా సార్వజనీన ఆరోగ్య సంరక్షణ పథకాన్ని(యూనివర్సల్ హెల్త్ ప్రొటెక్షన్ స్కీం) అమల్లోకి తీసుకురావాలని తెలంగాణ ప్రభుత్వం యోచిస్తుంది.