National
టీమిండియా ప్రయాణం సెమీస్‌తోనే ఇంటికి
Kalinga Times,Hyderabad : ట్రాఫోర్డ్ వేదికగా భారత్‌తో జరుగుతున్నసెమీ ఫైనల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్ 18 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఉత్కంఠభరితంగా సాగిన పోరులో భారత్ 49.2 ఓవర్లలో 221 పరుగులకు ఆలౌటైంది. భారత్ చివరి వరకు పోరాడినా కీలక సమయంలో జడేజా, ధోనీ ఔట్ అవ్వడంతో కివీస్ గెలుపొందింది. ఈ ప్రపంచకప్‌లో టీమిండియా ప్రయాణం సెమీస్‌తోనే ముగిసింది.