Religious
సాయిబాబా అందరి కోరికలు తీర్చేవారా?
Kalinga Times,Hyderabad : సాయిబాబాను కల్పతరువుగాను, కామధేనువుగాను, చింతామణిగానూ కోలుస్తారు. ఎందుకంటే ఆ మూడు కోరిన వాటిని ఇవ్వగల సమర్ధత ఉంది. అయితే సాయిబాబా అందరికి అన్ని సమకూర్చేవారా? అంటే అందరి కోరికలు తీర్చేవారా? అనే సందేహం కలుగుతుంది.తన వద్దకు వచ్చిన, రాని వ్యక్తుల వ్యాధులను ఆయన నయం చేశారు. భక్తుల కర్మ ఫలాలు అనుసరించి, మేలు చేసేటట్లయితేనే సాయి వ్యాధులను నయం చేసే వారు. నయం చేయకపోవటమే మేలు అనే ఆలోచన సాయిబాబాకు కలిగినపుడు, సాయి నయం చేసేవారు కాదు. ఒక్కోక్కసారి వ్యాధులను నయం చేయకపోవటం, ఆవ్యక్తి గాని, ఆవ్యక్తి కుటుంబానికి గాని కోపం లేదా అలుకను తెప్పించేవి. పసిబిడ్డడు ఆడుకోవటానికి నిప్పును లేదా అగ్నిని అడిగినపుడు తల్లి దండ్రులెవ్వరూ ఆపని చేయనివ్వరు కాదా! అలాగే సాయి చేసేది. ఈవిషయం సాయి బాబాకు మాత్రమే తెలుసు. అగ్నిని ఇవ్వని తల్లి తండ్రులకు తెలుసు కాని, అగ్నిని ఇవ్వలేదనే అలుక చెందేపని బాలునికి తెలియదు కదా!