Religious

మృత్యువు సైతం ఆమడదూరంలో

అవాంతరాలన్నీ తొలగిపోతాయి

Kalinga Times,Hyderabad : హిరణ్యకశిపుని సంహారం జరిగిన తర్వాత ఉగ్రరూపంలో ఉన్న నరసింహుని శాంతింపచేయడం దేవతల వల్ల కాలేదు. చివరికి ప్రహ్లాదుని ప్రార్థనను మన్నించి, శాంతించి లక్ష్మీనరసింహునిగా దర్శనమిస్తాడు విష్ణుమూర్తి. ప్రహ్లాదుని ఆదుకున్న విధంగానే, తనని కొలిచిన ప్రతి భక్తునీ అదుకుంటానని అభయమిస్తాడు. ఆ నృసింహుని జయంతి నాడు నృసింహ మూర్తిని పూజిస్తే, జీవితంలోని అవాంతరాలన్నీ తొలగిపోతాయని చెబుతారు. నృసింహస్వామికి ఎరుపు రంగంటే ఇష్టం. అందుకే ఎరుపు రంగు బట్టలను ధరించి, కుంకుమతో చేసిన అక్షతలతో పూజిస్తే విశేష ఫలితం ఉంటుంది. తులసి మాలలతో ఆయనను అలంకరించి, వడపప్పు పానకాలను నివేదిస్తే ఆ స్వామి ఆశీస్సు దక్కి తీరుతుంది. ఇక ఈ రోజున లక్ష్మీనరసింహకరావలంబ స్తోత్రం, నరసింహ అష్టోత్తరం, నరసింహాష్టకం, నరసింహ సహస్రనామాలను పఠిస్తే స్వామివారి అనుగ్రహం తప్పక లభిస్తుంది. – నృసింహ జయంతి రోజున స్వామివారిని కొలుచుకునే అవకాశం లేకపోయినా ‘ఓం నమో నారసింహాయ’ అనే మంత్రాన్ని 108 సార్లు జపిస్తే స్వామివారి కటాక్షం దక్కుతుందంటారు పెద్దలు. – ‘నారసింహాయ విద్మహే వజ్రనఖాయ ధీమహి తన్నః సింహః ప్రచోదయాత్‌’ అంటూ నృసింహ గాయత్రిని జపిస్తూ ఉన్నా ఎటువంటి అనారోగ్యం, ఆపదల నుంచైనా విముక్తి లభిస్తుందట. – ‘ఉగ్రవీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖమ్‌ నృసింహం భీషణం భద్రం మృత్యోర్‌ మృత్యుం నమామ్యహం’ అనే మంత్రాన్ని పఠించినా మృత్యువు సైతం ఆమడదూరంలో నిలిచిపోతుందని నమ్మకం.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close