Andhra Pradesh

ఆత్మహత్య వెనుక ప్రేమ వ్యవహారం

Kalinga Times ,Vizag :ముగ్గురు బిడ్డల తండ్రిని ప్రేమించిన ఓ యువతి నిజం తెలుసుకుని మంటల్లో తనను తాను దహించుకుంది. వైజాగ్‌లో నడి రోడ్డుపై ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుంది. శివాజీపాలెం రోడ్‌లో నడుచుకుంటూ వెళుతున్న నడిరోడ్డుపై ఓ యువతి ఉన్నట్టుండి మంటల్లో కాలుతుండడాన్ని గమనించిన స్థానికులు, మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు.బాగా కాలిన గాయాలతో ఆమెను స్థానికులు ఆస్పత్రికి తరలించగా, కేజీహెచ్‌లో చికిత్స పొందుతూ మరణించింది. కావ్య కాల్ డేటాను, చాటింగ్ వివరాలను పరిశీలించిన తర్వాత ప్రేమ వ్యవహారం ఈ ఆత్మహత్య వెనుక ఉందని గుర్తించామని, కేసును మరింత లోతుగా విచారిస్తున్నామని పోలీసులు వెల్లడించారు. పెళ్లయి, ముగ్గురు బిడ్డల తండ్రిని ప్రేమించిన ఆమె, విషయం తెలిసిన తర్వాత ఆ ప్రేమను వదులుకోలేక మనస్తాపంతో ఈ దారుణానికి పాల్పడిందని పోలీసులు చెబుతున్నారు.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close