
Kalinga Times ,Hyderabad : ప్రజల తరుపున ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మండిపడ్డారు. నియోజకవర్గంలో టీఆర్ఎస్ చేసిన అభివృద్ధి ఏంటో చెప్పాలని డిమాండ్ చేశారు. టీఆర్‌ఎస్ నాయకులతో చర్చకు తాను సిద్ధమంటూ సవాల్ విసిరారు. గత నాలుగేళ్లుగా సంగారెడ్డి నియోజకవర్గానికి టీఆర్ఎస్ ప్రభుత్వం అన్యాయం చేస్తోందని ఆరోపించారు.అధికారంలో లేకపోయినా నిధులు తెచ్చి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయగల సత్తా తనకు ఉందని స్పష్టం చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో పోలీసులే డబ్బులు పంచారంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజల తరపున ప్రశ్నిస్తే కొంతమంది తనను వ్యక్తిగతంగా విమర్శిస్తున్నారని వ్యక్తిగత విమర్శలకు దిగితే తన ప్రతాపం చూపిస్తానని హెచ్చరించారు. సోమవారం కాంగ్రెస్ నుంచి పురపాలక చైర్మన్ అభ్యర్థుల్ని ప్రకటిస్తానని జగ్గారెడ్డి తెలిపారు. చైర్మన్ అభ్యర్థులను ప్రకటించే సత్తా టీఆర్‌ఎస్ పార్టీకి ఉందా అని ఎమ్మెల్యే జగ్గారెడ్డి నిలదీశారు.