Telangana
వికలాంగులకు ప్రభుత్వం సహకారం ఇవ్వాలని డిమాండ్ – ఆర్. కృష్ణయ్య
Kalinga Times, హైదరాబాద్ : డిజేబుల్ వాయిస్ (జాతీయ వికలాంగుల సంఘాల ఐక్యవేదిక) ఆధ్వర్యంలో సోమాజిగూడలోని ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్ ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఈ సంస్థలోని ముఖ్యులు మురళీధర్ రావు మాట్లాడుతూ వికలాంగులు మరొకరి సహాయం ఉంటే గానీ కనీసం వారి పనులు కూడా వారు చేసుకోలేని స్థితి ఇలాంటి వికలాంగులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఎంతైనా ఉంది .ప్రతి చోట ప్రతి చోట మాకు స్థానం కల్పించాలని ఎప్పుడూ ఇరవై ఏళ్ల కింద ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు ఇంకా ఇప్పటికి కూడా అమలులోకి రాలేదు అని కనీసం ఈ ప్రభుత్వమైనా ఇప్పుడైనా వికలాంగులను ఆదుకోవాలని, అమెరికా, లండన్ వంటి దేశాల్లో వికలాంగులకు ప్రత్యేకమైన వసతులు, హోదాలు, ఉద్యోగాలు, సరైన అవకాశాలు, కమిషన్లు ఉన్నాయి, మన దేశంలో కూడా మాకు అలాంటి అవకాశాలు కావాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు. సంస్థ జాతీయ అధ్యక్షుడు షణ్ముఖరావు మాట్లాడుతూ ఎప్పుడో ఇరవై సంవత్సరాలకు సగం జారీ చేసిన ఉత్తర్వులు ఇంకా వికలాంగులకు అందలేదని అదృష్టం నోచుకోలేదని ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరిచి, మాకు సరైన అవకాశాలు హోదాలు ఉద్యోగాలు విద్యావకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మాజీ శాసనసభ సభ్యులు, బీ.సీ సంఘ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ ప్రపంచంలో దీనమైన స్థితి వికలాంగులదని…, ఇలాంటి వారికి ప్రభుత్వం సహాయం చేయడం చాలా బాధాకరమైన విషయమని… వారికి ప్రతి చోట ప్రైవేటు సంస్థల్లో, ప్రభుత్వ సంస్థల్లో అవకాశాలు కల్పించాలని… ఇంతకు ముందు ఉన్న రిజర్వేషన్ రెండు శాతాన్ని కనీసం అయిదు శాతంకు పెంచాలని…. ప్రభుత్వ పాఠశాలల్లో, ప్రైవేటు పాఠశాలల్లో, ఇన్స్టిట్యూట్లలో వికలాంగులకు అందరికీ ఉచితంగా స్థానం కల్పించాలని, వికలాంగులకు ప్రతి నెల కనీస భృతి ఆరు వేలకు పెంచాలని, విదేశాల్లో లాగా వీరికి సరైన కమిషన్ కావాలన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో జనరల్ సెక్రెటరీ మంగమ్మ మరియు ఇతర సభ్యులు పాల్గొన్నారు