Kalinga Times,హైదరాబాద్: నగరంలో పోలీసులు, డిఆర్ఐ అధికారుల కళ్లుగప్పి బంగారం తరలిస్తున్న ముఠాను వలపన్ని ఎట్టకేలకు పోలీసులు అరెస్టు చేశారు. ముందస్తు సమాచారంతో తనిఖీలు చెపట్టిన అధికారులు నింధితుల నుండి బంగారం స్వాధీనం చేసుకున్నారు.
జెడ్డా నుండి హైదరాబాద్ సౌది ఎయిర్ లైన్స్ (ఎస్ వి 744)లో వస్తున్న 14 మంది ప్రయాణికులు అక్రమ బంగారం తెస్తుంన్నారనే పక్క సమాచారం అందుకున్న డైరెక్టర్ ఆఫ్ రెవిన్యూ ఇంటలిజెన్స్ మరియు సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో మాటు వేసి వారిని అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకున్న 14 మందిని చెకింగ్ చేయడంతో వారి వద్ద 6.46 కిలోల 24 క్యారెట్స్ గోల్డ్ చైన్ లు గడ్డి ముక్కలు భయటపడ్డాయి.
పట్టుబడ్డ బంగారం విలువ 2.17 కోట్లు ఉంటుందని అంచనా వేశారు ఆధికారులు. ఉమ్రా వెళ్ళే అమయక ప్రజలను ఎజెంట్లు కమీషన్ లు ఇస్తామని మయమాటలు చెప్పి విదేశాలో తక్కువ ధరకు బంగారం కోనుగోలు చేసి తిరుగు ప్రయాణంలో ఉమ్రా యాత్రికులకు ఇచ్చి పంపుతారు.శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు చేరుకున్న తర్వాత వారి వద్ద బంగారం స్వాధీనం చేసుకుని కమీషన్ లు ఇస్తారు. ఇదే తరహాలో స్మగ్లింగ్ చేస్తూ 14 మంది పట్టు బడ్డారు. స్మగ్లింగ్ వెనుక ఎవరెవరు ఉంన్నారనే కోణంలో నింధితులను విచారిస్తుంన్నారు DRI ఆధికారులు.