Kalinga Times : హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు సరికొత్త ప్రయోగానికి తెరతీశారు. ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడకుండా ట్రాఫిక్ సిగ్నల్ లైట్లను రోడ్డుపై ఏర్పాటు చేశారు. దీంతో సిగ్నల్ జంపింగ్‌లకు అడ్డుకట్టపడడంతో పాటు ప్రమాదాలు జరగకుండా అరికట్టవచ్చంటున్నారు పోలీసులు. అంతే కాదు ట్రాఫిక్ సాఫీగా సాగిపోతుందంటున్నారు. అనలాగ్, డిజిటల్ ల్యాబ్ సహకారంతో బంజారాహిల్స్‌లోని కేబీఆర్ పార్కు సెంటర్ లో వీటిని ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేశారు. జీబ్రా క్రాసింగ్ కంటే ముందే వీటిని ఏర్పాటు చేయడంతో సిగ్నల్ ఉల్లంఘనలు తగ్గనున్నాయి. కలర్ ఫుల్ గా కన్పిస్తున్న సిగ్నల్ లైట్లు వాహనదారులను ఆకట్టుకుంటున్నాయి.
With Product You Purchase
Subscribe to our mailing list to get the new updates!
Lorem ipsum dolor sit amet, consectetur.