Film
‘ఆస్ట్రియాలోని టిరోల్ ప్రాంతంలో ‘సాహో’ షూటింగ్
Kalinga Times :యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతోన్న భారీ యాక్షన్ చిత్రం ‘సాహో’. ఇప్పటికే సినిమాకు సంబంధించిన మేజర్ పార్టీ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పాటల చిత్రీకరణ జరుపుకుంటోంది. ఆగస్ట్ 15న సినిమా రిలీజ్ చేస్తుండడంతో ప్రమోషన్స్ కూడా ముమ్మరం చేశారు.తాజాగా హీరో ప్రభాస్ ఆస్ట్రియాలో జరుగుతున్న షూటింగ్ కి సంబంధించిన ఓ స్టిల్ ను తన సోషల్ మీడియా అకౌంట్ లో షేర్ చేశారు. ‘ఆస్ట్రియాలోని ఇన్స్ బ్రక్, టిరోల్ ప్రాంతంలో షూటింగ్.. గతంలో ఎన్నడూ లేని ఓ అధ్బుతమైన అనుభూతి’ అంటూ ట్వీట్ చేశాడు.