Telangana
ఆదిలాబాద్ జిల్లా డిపో సూపర్ లగ్జరీ బస్సు బోల్తా
Kalinga Times హైదరాబాద్ : మొజంజాహీ మార్కెట్ సర్కిల్‌లో ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు బోల్తా పడింది. బుధవారం తెల్లవారుజామున ఆదిలాబాద్ జిల్లా డిపోకు చెందిన బస్సును ఎంజే మార్కెట్ సిగ్నల్ మలుపు దగ్గర ఇసుక లారీ ఢీకొనడంతో బస్సు బోల్తాకొట్టింది. ఈ ఘటనలో బస్సు డ్రైవర్‌తో సహా ఏడుగురు ప్రయాణికులు గాయపడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వారిని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స తర్వాత ప్రయాణికులను వేరే బస్సులో తరలించారు. రోడ్డుకు మధ్యలో బోల్తా పడిన బస్సును క్రేన్ సహాయంతో తొలగించారు.మలుపుల వద్ద సరైన హెచ్చరికల బోర్డులు లేకపోవడం, సరైన భద్రతా చర్యలు లేకపోవడంతో వరుస ప్రమాదాలు జరుగుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు. దీనికితోడు మెట్రో రైలు పిల్లర్లు కూడా ప్రయాణీకుల అదృష్టాన్ని పరీక్షిస్తున్నాయి.