National
ఫేస్‌బుక్ కార్యాలయానికి విషపు వాయువు పార్సిల్
Kalinga Times : సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ సి లికాన్ వ్యాలీలోని కార్యాలయానికి ఓ పార్శిల్ వచ్చింది. ఆ పార్సిల్‌ను తాకిన ఇద్దరు ఉద్యోగులు వాయువు దుష్పరిణామానికి గురయ్యారు. దీంతో అప్రమత్తమైన అధికారులు స్థానిక అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. సంఘటనా స్థలికి చేరుకున్న సిబ్బంది కంపెనీ ఉద్యోగులను మూడు భవనాల నుంచి ఖాళీ చేయించారు. పార్శిళ్ల విభాగాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయగా సదరు వాయువును ‘‘సారిన్’’గా గుర్తించారు. ఈ వాయువు అత్యంత ప్రమాదకరమైనది.
#NOW: @menlofire crews are at the scene of a hazmat call at a Facebook warehouse facility on Hamilton Ave. in Menlo Park. FBI and National Guard have been called to assist. Two employees were tested for possible chemical exposure, but have shown no symptoms, per fire marshal. pic.twitter.com/iL8DkKZGfU
— Chris Nguyen (@ChrisNguyenABC7) July 1, 2019
ఇది నాడీవ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుందని.. అలాగే 1995లో జపాన్‌లో ఆరు రైళ్లలో సారిన్ వదలడంతో 13 మంది చనిపోయినట్లుగా ఫెడరల్ బ్యూరో ఇన్వెస్టిగేషన్ (ఎఫ్‌బీఐ) అధికారులు తెలిపారు.